గోపీచంద్ కి ఐటమ్ పాపగా మారిన బాలీవుడ్ హీరోయిన్

హేట్ స్టొరీ 4తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అందాల ప్రదర్శనతో అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్న ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతాల.అయితే బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ తో పాటు కొన్ని సినిమాలలో అవకాశాలు తెచ్చుకున్న పూర్తి స్థాయిలో మాత్రం తనకంటూ గుర్తింపుస ఒంతం చేసుకోలేకపోయింది.

 Urvashi Rautela Item Song For Telugu Movie, Tollywood, Seeti Maar, Gopichand, Sa-TeluguStop.com

అయితే బాలీవుడ్ లో అందరి భామల తరహాలోనే ఈ అమ్మడు కూడా ఏ మాత్రం దాచుకోకుండా అందాలు విందు చేయడంతోనే ఎక్కువగా అందరికి గుర్తుంది.అలాగే అప్పుడప్పుడు ఆమె చేసే ట్వీట్ తో కూడా సోషల్ మీడియాలో కాస్తా సందడి చేస్తుంది.

అందాల ప్రదర్శన చేయడానికి ఏ మాత్రం అడ్డు చెప్పని ఈ భామ టాలీవుడ్ లో అవకాశాలు సొంతం చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటుంది.

అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఆ అవకాశం ఆమెని వెతుక్కుంటూ వచ్చింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో కమర్షియల్ సినిమా అంటే కచ్చితంగా ఐటెం సాంగ్ ఉండాల్సిందే.గతంలో ఐటెం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారు.ఇప్పుడు హీరోయిన్స్ కూడా రెమ్యునరేషన్ కోసం ఐటెం సాంగ్స్ లో నటించడానికి ఒకే చెప్పేస్తున్నారు.స్టార్ హీరోయిన్స్ గా ఉన్న కూడా రెమ్యునరేషన్ భాగా ఇస్తే వెంటనే ఒకే అంటున్నారు.

ఈ నేపధ్యంలో బాలీవుడ్ భామలు కూడా సౌత్ సినిమాలలో ఐటెం సాంగ్స్ కోసం వచ్చిపోతున్నారు.ఇప్పుడు అలాగే గోపిచంద్, సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సిటీ మార్ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఊర్వశీ ని ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ సాంగ్ క్లిక్ అయితే తెలుగులో ఆమెకి అవకాశాలు పెరిగే అవకాశం ఉందనే ఆశతో ఈ అమ్మడు ఉంది.మరి అది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube