పాట కోసం అతడి బనియన్ ధరించమన్నారు.. కట్ చేస్తే?

సాధారణంగా కొన్ని సినిమాలలో కొన్ని సన్నివేశాలలో నటించడం కోసం హీరో హీరోయిన్లు భయపడుతూనే కొన్ని సాహసాలను చేయాల్సి వస్తుంది.ఇలా భయంతో చేసిన ఆ సినిమాలు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాయన్న సందేహం ఆ చిత్రం విడుదలయ్యే వరకూ సదరు నటీనటులను వెంటాడుతూనే ఉంటుంది.

 Actress Urmila Matondkar Shares Rangeela Movie Incidents, Actress Urmila Matondk-TeluguStop.com

ఆ సినిమా విడుదలయ్యి మంచి ఆదరణ తగ్గించుకుంటే ఆ విషయం గురించి ఎన్ని సంవత్సరాలు గడిచిన గుర్తు చేసుకుంటూనే ఉంటారు.ఇలా బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ మాటోండ్కర్ తాను నటించిన  ‘రంగీలా’సినిమాలోని ఒక పాట గురించి ఒక ఆశక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

అమీర్‌ ఖాన్‌, నటుడు జాకీ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమా విజయవంతం కావడంతో నటి ఊర్మిళ కి కూడా మంచి క్రేజ్ వచ్చిందని చెప్పాలి.

తాజాగా నటి ఊర్మిళ ఓ సందర్భంలో మాట్లాడుతూ ఈ సినిమాలో ఒక పాటలో జరిగిన సన్నివేశం గురించి తెలియజేశారు.ఈ సినిమాలోని ఒక పాట మొదటిలో బనియన్ వేసుకొని బీచ్ ఒడ్డున పరిగెడుతూ ఉంటుంది.

అయితే ఆ పాటలో తాను ధరించిన బనియన్ తనది కాదని నటుడు జాకీ షరాఫ్ దని ఈ సందర్భంగా వెల్లడించారు.

Telugu Actressurmila, Ameer Khan, Bollywood, Jackie Shroff, Rangeela, Urmila, Ur

ఈ సినిమాలో ఈ పాట చాలా సహజంగా రావాలని భావించడంతో డైరెక్టర్ నటుడు జాకీ బనియన్ వేసుకోమని చెప్పారు.తను అలా చెప్పగా మొదట్లో ఆ బనియన్ వేసుకోవడానికి కొద్దిగా భయం వేసినప్పటికీ, ఆ తర్వాత వేసుకుని ఈ పాటలో నటించానని ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ పాట సూపర్ హిట్ అయిందని ఈ సందర్భంగా తెలియజేశారు.బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube