మోడీ ప్రభుత్వంపై రంగీలాకి కోపం వచ్చింది

రంగీలా సినిమాతో ఒక్కసారిగా బాలీవుడ్ లో పాపులర్ అయిన ఆర్జీవీ హీరోయిన్ ఊర్మిలా మతోడ్కర్.బాలీవుడ్ చాలా మంది స్టార్ హీరోలతో ఆడిపాడిన ఈ భామ ప్రస్తుతం గత ఎన్నికల ముందు సినిమాలకి విరామం ఇచ్చి రాజకీయాలలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసింది.

 Urmila Matondkar British Rowlatt Modi-TeluguStop.com

అయితే ఎన్నికలలో ఓడిపోయినా తర్వాత మరల వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది.సామాజిక కార్యక్రమాలాలో ముందుండే ఈ భామ తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

సీఏఏ చట్టాన్ని బ్రిటీషర్లు ప్రవేశపెట్టిన రౌలత్‌ చట్టంతో ఆమె పోల్చారు.ఈ చట్టాన్ని బ్లాక్ యాక్ట్ క్రింద అభివర్ణించింది.మహాత్మా గాంధీ వ‍ర్థంతి సందర్భంగా ముంబైలో నివాళి ఆమె సీఏఏ చట్టాన్ని తప్పుబట్టారు.బ్రిటీషర్లు దేశాన్ని వదలివెళ్లిన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం దేశంలో అశాంతిని కారణం అయిన రౌలత్ చట్టంలానే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు.

నల్లచట్టాల సరసన పౌరసత్వ చట్టం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.ఈమె విమర్శలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

దేశ భద్రత కోసం తీసుకొచ్చిన చట్టాలని బ్రిటిష్ చట్టాలతో పోల్చడం సరైన పద్ధతి కాదని విమర్శిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube