ఆర్జీవి పరువు తీసిన ఊర్మిళ! అతనెవరో కూడా తెలియదు  

ఆర్జీవి గురించి చెప్పమంటే లైట్ తీసుకోమన్న ఊర్మిళ. .

Urmila Interesting Comments On Rgv-bollywood,congress,rgv,tollywood,urmila Interesting Comments

ఊర్మిళా అంటే తెలుగు ప్రేక్షకుల పెద్దగా తెలియకపోవచ్చు కాని ఆర్జీవి రంగీలా అంటే మాత్రం అందరికి వెంటనే గుర్తుకొస్తుంది. రామ్ గోపాల్ వర్మ సినిమాలతో సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకొని గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఊర్మిళ తాజాగా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ ఎంపీగా బరిలో దిగింది. ప్రస్తుతం ఆమె చక్కాగా రాజకీయ నాయకురాలి గెటప్ లో ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతుంది..

ఆర్జీవి పరువు తీసిన ఊర్మిళ! అతనెవరో కూడా తెలియదు -Urmila Interesting Comments On RGV

ఇదిలా ఉంటే ఊర్మిళకి స్టార్ హీరోయిన్ గా క్రేజీ రావడానికి కారణం అయిన ఆర్జీవి ఆమె పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వాఖ్యలు చేసి ఈ మధ్య పోస్టింగ్ లు మరీ ఎక్కువ పెడుతున్నాడు. ఆర్జీవితో అప్పట్లో ఈ భామ రిలేషన్ లో ఉందని కూడా టాక్ భాగా వినిపించింది. అయితే తాజాగా రాజకీయాలతో బిజీగా ఉన్న ఊర్మిళని ఓ మీడియా ఆర్జీవి కామెంట్స్ పై స్పందించమని కోరగా ఆమె లైట్ తీసుకోమని చెబుతూ అతనెవరో తెలియదు అన్నట్లు లుక్ ఇచ్చింది.

ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. దీంతో రాము డ్రీం గర్ల్స్ అతని గాలి తీసేసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఆర్జీవి ఎ విధంగా స్పందిస్తాడు అనేది చూడాలి.