కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పిన స్టార్‌ హీరోయిన్‌  

Urmila Good By To Congress Party-congress Party In Mumbai,urmila

నాలుగు నెలల క్రితం జరిగిన పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల సమయంలో సినీ నటి ఊర్మిల కాంగ్రెస్‌లో జాయిన్‌ అయిన విషయం తెల్సిందే.కాంగ్రెస్‌ తరపున ఆమె పలు నియోజక వర్గాల్లో ప్రచారం చేయడంతో పాటు, ఆమె ముంబయి నార్త్‌ పార్లమెంటు నియోజక వర్గం నుండి పోటీ చేసిన విషయం కూడా తెల్సిందే.ఆ ఎన్నికల్లో ఊర్మిల దాదాపుగా 4 లక్షల ఓట్ల పైచిలుకు ఓట్తతో ఓడిపోయింది.ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి గోపాల్‌ శెట్టి చేతిలో దారుణ పరాజయం పాలయ్యింది...

Urmila Good By To Congress Party-congress Party In Mumbai,urmila-Urmila Good By To Congress Party-Congress Party In Mumbai

ఎన్నికలు పూర్తి అయిన తర్వాత అడపా దడపా రాజకీయాల్లో కనిపిస్తున్న ఆమె తాజాగా కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెబుతున్నట్లుగా ప్రకటించింది.

గత కొన్నాళ్లుగా ముంబయి రాజకీయాల్లో తనను ఒక పావుగా వాడుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించిందని, అందుకే తాను కాంగ్రెస్‌ పార్టీ ప్రాధమిక సభ్యత్వంకు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించింది.బాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్టార్‌డంను దక్కించుకున్న ఊర్మిల రాజకీయాల్లో మాత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.

Urmila Good By To Congress Party-congress Party In Mumbai,urmila-Urmila Good By To Congress Party-Congress Party In Mumbai

ఒక ఎంపీ అభ్యర్థి 4 లక్షల పైచిలుకు ఓట్లతో ఓడిపోవడం అంటే దారుణం.స్టార్‌గా ఆమెను గుర్తించిన జనాలు రాజకీయ నాయకురాలిగా మాత్రం ఆమెను స్వీకరించలేదు.దాంతో ఊర్మిల రాజకీయాలకు గుడ్‌ బై చెప్పేసింది.కొందరు త్వరలో ఊర్మిల బీజేపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు.