మూత్రం డార్క్ కలర్ లో ఉండే...మీరు సమస్యల్లో పడినట్టే... ఎలాగో తెలుసా?       2018-06-22   01:10:15  IST  Lakshmi P

ఆరోగ్యంగా ఉన్న వారి మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. అయితే కొన్ని సార్లు మూత్రం రంగు మారుతూ ఉంటుంది. ముదురు గోధుమరంగు లేదా ముదురు పసుపు రంగులలో ఉంటె మాత్రం అనారోగ్య సమస్యలు ఉన్నట్టు అర్ధం చేసుకోవాలి. వెంటనే డాక్టర్ ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. అయితే మూత్రం డార్క్ కలర్ లో ఉంటే ఏ అనారోగ్య సమస్యలకు చిహ్నమో తెలుసుకుందాము.

-

శరీరంలో సరైన స్థాయిలో ద్రవాలు లేకపోవటం వలన డీ హైడ్రేషన్ సమస్య వస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు మూత్రం డార్క్ రంగులోకి మారుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు నోరు పొడిగా మారడం, తల దిమ్ముగా అనిపించడం, నీరసం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు మంచి నీటిని ఎక్కువగా త్రాగాలి.

మూత్రం డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటే లివర్ వ్యాధులు ఉన్నట్టు అర్ధం చేసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. ఎటువంటి అశ్రద్ధ చూపకూడదు.

కొన్ని రకాల మందులను రెగ్యులర్ గా వాడినప్పుడు కూడా మూత్రం రంగు మారుతుంది. అలాంటి సమయంలో కంగారు పడవలసిన అవసరం లేదు.

పచ్చ కామెర్లు ఉన్నవారిలోనూ మూత్రం రంగు మారుతుంది. మూత్రం డార్క్ కలర్‌లో వస్తుంది. లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పచ్చకామెర్ల వ్యాధి వస్తుంది. దీని వల్ల కళ్లు, చర్మం కూడా పసుపు రంగులోకి మారతాయి . అలాగే మూత్రం కూడా ముదురు పసుపు రంగులో వస్తుంటుంది. ఇలా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.