బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉర్ఫి జావేద్ మనందరికి సుపరిచితమే.హిందీలో జరిగిన ఓటీటీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఈమె ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ లో తన అందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లతో కుర్రకారు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.కొన్ని సందర్భాలలో ఈమె తన వస్త్రధారణ విషయంలో దారుణంగా ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.
ఈమె ఎప్పుడూ తన హాట్ ఫోటోలు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తూనే ఉంటాయి.ఇదిలా ఉంటే తాజాగా ఉర్ఫి జావేద్ తీవ్రస్థాయిలో నెటిజన్ల పై చిరాకు పడుతోంది.
ఆమె తన జడను అల్లుకోవడం పాపం అయిపోయింది.ఉర్ఫి జావేద్ చిరాకు పడటానికి గల కారణం కూడా లేకపోలేదు.
ఇటీవలే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన పొడవాటి జడతో దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే.వాటికీ సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా అచ్చం ప్రియాంక చోప్రా చేసిన లాగే ఉర్ఫి జావేద్ కూడా జడను అల్లుకుని కనిపించింది.

ఈ ఫోటోను చూసిన కొందరు నెటిజన్స్ నువ్వు ప్రియాంక చోప్రాని కాపీ కొట్టావు అంటూ విమర్శలు చేస్తున్నారు.ఇక తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ ఉర్ఫి జావేద్ జడ అల్లుకొన్న తన పాత ఫోటోలు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది.ఇది నాలుగు నెలల క్రితం తీసిన ఫోటో ఇప్పటికీ నేను ప్రియాంక చోప్రాను కాపీ కొట్టాను అంటారా చెప్పండి అంటూ తనపై విమర్శలు చేసే వారిని నిలదీసింది.
నేను ఎప్పుడూ నా జుట్టును ఎలా చేసుకుంటానో అదే హెయిర్ స్టైల్ వేసుకున్నాను.కాకపోతే అప్పటి కంటే ఇప్పుడు ఉన్న జుట్టు కాస్త పొడుగ్గా అయింది అంతే.
అయినా జడలు అల్లు కోవడం అనేది సర్వసాధారణమైన విషయం, జడ అల్లుకోవడం కూడా ఒకరిని కాపీ కొట్టారు అంటే ప్రపంచమే సిగ్గుపడాలి వస్తుంది అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.