సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లు కాస్మెటిక్ సర్జరీలను ఆశ్రయించడం అన్నది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది.అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం ఇలా నానా తంటాలు పడుతూ ఉంటారు హీరోయిన్స్.
అయితే మామూలుగా హీరోయిన్లు అలా కాస్మెటిక్ సర్జరీ( Cosmetic surgery ) చేయించుకున్నప్పటికీ ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి అంతగా ఇష్టపడరు.కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం వారి శరీరంలో ఏఏ పార్ట్స్ కి సర్జరీ చేయించుకున్నారు అన్న విషయాన్ని నిర్మొహమాటంగా బయట పెడుతూ ఉంటారు.

అలా ఇండస్ట్రీలో ఉర్ఫీ జావేద్ ( Urfi Javed )నుంచి శ్రుతి హాసన్ ( Shruti Haasan )వరకు పలువురు హీరోయిన్స్ వారికీ జరిగిన శస్త్రచికిత్స గురించి తెలిపారు.ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరు వారు ఏఏ భాగాలకు కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారు అన్న వివరాల్లోకి వెళితే.బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ గురించి మనందరికీ తెలిసిందే.విచిత్రమైన ఫ్యాషన్స్ తో తరచూ సోషల్ మీడియాలో నిలిచే ఉర్ఫీ జావెద్ తన కాస్మెటిక్ సర్జరీ గురించి తెలిపింది.
తనకు లిప్ సర్జరీ జరిగినట్లు ఉర్ఫీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.అలాగే ప్రముఖ కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ కూడా తన పెదాలకు ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు తెలిపింది.

ఇదే విషయాన్ని ఎప్పుడో ఆమె అధికారికంగానే తెలిపింది.అయితే సర్జరీ చేసి అందాన్ని పెంచుకోవడంలో తప్పేమీ లేదని నటి తెలిపింది శృతి హాసన్.అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ( Anushka Sharma )కూడా బాంబే వెల్వెట్ కోసం తాత్కాలిక లిప్ ప్లంపర్‌ని ఉపయోగించినట్లు వెల్లడించింది.మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి ( Shilpa Shetty )కూడా తన ముఖాన్ని మరింత అందంగా మార్చుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.
ఈ హీరోయిన్ లు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటికి వెల్లడించడానికి ఇష్టపడడం లేదు.