పాదయాత్రకు పవన్ రెడీ ! అసలు కారణం ఏంటంటే ?  

Uranium Effect Pawan Kalyan Ready To Foot Trip - Telugu Ap Nallamalla, Kadapa, Kurnool, Nalla Malla Forest, Pawan Kalyan, Telangana Nalla Malla Forest, Uranium

ఏపీలోనే కాదు తెలంగాణలోనూ రాజకీయ సంచలనాలకు కారణం అవుతున్న జనసేన అధినేత పవన్ ముందు ముందు రాజకీయంగా స్పీడ్ పెంచేందుకు సిద్ధం అవుతున్నాడు.తాజాగా నల్లమల అడవుల్లో పుష్కలంగా ఉన్న యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పవన్ గళం విప్పారు.

Uranium Effect Pawan Kalyan Ready To Foot Trip

దీనిపై పూర్తి స్థాయిలో జనసేన తరపున పోరాడాలని పవన్ నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది.నల్లమల యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వం మాయ మాటలు చెబుతూ యూరేనియం తవ్వకానికే సిద్దపడతున్నారని దీనిపై ఇక పోరాటానికి సిద్ధమవ్వాలని ఆలోచనకు వీరంతా వచ్చారు.

ఈ మేరకు నల్లమల గ్రామాల్లో పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కూడా పాదయాత్రకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

పాదయాత్రకు పవన్ రెడీ అసలు కారణం ఏంటంటే -Political-Telugu Tollywood Photo Image

 వాస్తవానికి పవన్ కల్యాణ్ పాదయాత్ర విషయంలో చాలా కాలంగా ఆసక్తితో ఉన్నారు.అనంతపురం కరువు నుంచి ప్రజలను రక్షించడానికి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.కానీ అది కార్యరూపం దాల్చలేదు.చివరిలో బస్సు యాత్ర చేసినా అది కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.అదే సమయంలో ఎన్నికల సమయం కూడా ముంచుకురావడంతో యాత్రలకు పవన్ బ్రేక్ చెప్పాల్సి వచ్చింది కానీ పవన్ కల్యాణ్ ఈ సారి మాత్రం ఓ స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.దీనికి ప్రజలనుంచి కూడా మద్దతు గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది.

అభివృద్ధి పేరిట అడవి విధ్వంసం అవుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు భయపడుతున్నారని పవన్ ప్రశ్నిస్తున్నారు.పర్యావరణo నాశనం అవుతుంటే తనకు చాలా బాధ ఉందని అందుకే తాను ఈ పోరాటంలోకి వచ్చానన్నారు.

 ఇక పవన్ పాదయాత్ర విషయానికి వస్తే యూరేనియం వల్ల నష్టపోయే ప్రాంతాల్లో మొదటగా పవన్ కల్యాణ్ పాదయాత్ర చేపట్టే అవకాశం కనిపిస్తోంది.తెలంగాణలోని నల్లమలతో పాటు ఏపీలోని కడప జిల్లాలోనూ ఈ యూరేనియం సమస్య ఉంది.నిజానికి నల్లమలలో ఇంకా తవ్వకాలు ప్రారంభం కాలేదు.కానీ కడప జిల్లాలోల మాత్రం యూరేనియం ఇప్పటికే మొదలయ్యింది.అంతేకాదు పులివెందుల ప్రజలు ఈ యురేనియం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ నేపథ్యంలో పవన్ చేపట్టబోయే ఈ పాదయాత్ర పులివెందుల నుంచి మొదలుపెట్టినా ఆశ్చర్యపోనవసరంలేదు.

ఎందుకంటే ఇది ఏపీ సీఎం జగన్ సొంత ప్రాంతం కావడంతో ఏపీలో రాజకీయ రచ్చ మొదలయ్యే అవకాశం కూడా ఉంది.దీని కారణంగా జగన్ ను ఇరుకునపెట్టడంతో పాటు జనసేనకు ఏపీలోనూ మైలేజ్ వచ్చే అవకాశం ఉందని పవన్ భావిస్తున్నారట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uranium Effect Pawan Kalyan Ready To Foot Trip-kadapa,kurnool,nalla Malla Forest,pawan Kalyan,telangana Nalla Malla Forest,uranium Related....