మామూలుగా మందులోకి కొందరు స్టప్ గా నంజుకోవడం కోసం చికెన్, చిప్స్, ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటుంటారు.కానీ ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా తన మందు పార్టీ లోకి నంజుకోవడం కోసం ఏకంగా తన ప్రియురాలి కాళ్ళు నరికి వాటితో ఫ్రై చేసుకుని తిన్న ఘటన తూర్పు యూరప్ లోని ఉక్రెయిన్ దేశంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంతంలో అలెగ్జాండర్ అనే ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఇతడికి తరచూ మద్యం సేవించే అలవాటు ఉంది.దీంతో తాజాగా మరోమారు మద్యం సేవించడానికి అన్ని సిద్ధం చేసుకొని మందులోకి నంజుకోవడం కోసం ఏకంగా తన ప్రియురాలిని హత్య చేసి ఆమె కాళ్లు నరికి వాటిని పెనంపై వేగించి భక్షించాడు. ఈ విషయం తెలుసుకున్న టువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అది నిజమే అని ఆధారాలతో సహా తేల్చారు.
దీంతో వెంటనే అలెగ్జాండర్ ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.దీంతో కోర్టు మెజిస్ట్రేట్ అలెగ్జాండర్ కి రిమాండ్ విధించడంతో పాటు పలు మానసిక వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలని తీర్పునిచ్చారు. పోలీసులు అలెగ్జాండర్ నీ వైద్యనిపుణుల దగ్గరికి తీసుకెళ్లడంతో పలు విషయాలను తెలుసుకున్నారు. చిన్నప్పటినుంచి అలెగ్జాండర్ పలు మానసిక ఒత్తిడులు మరియు ఒంటరిగా పెరగడం వంటి వాటితో మానసిక రుగ్మతలకు గురయ్యాడని అందువల్లనే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని తెలిపారు.