జగన్ నిర్ణయం పై రచ్చ ! జూనియర్ ఎన్టీఆర్ పై ట్రోలింగ్స్ ? 

నిన్ననే ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లును ఆమోదించారు.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్సార్  హెల్త్ యూనివర్సిటీ గా మార్చడంపై పెద్ద దుమారమే రేపుతోంది.

 Uproar Over Jagan's Decision! Trolling On Junior Ntr Juniour Ntr, Ntr Health Uni-TeluguStop.com

అసలు యూనివర్సిటీ స్థాపించడానికి కారణమైన ఎన్టీఆర్ ను పక్కనపెట్టి ఏ సంబంధం లేని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం ఏమిటని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టాయి.అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం మాత్రం తమ వాదనను మరో విధంగా వినిపిస్తోంది.

రాష్ట్రంలో వైద్య రంగానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో చేశారని, వైద్య రంగాన్ని సంస్కరించిన నాయకుడుగా నిలిచారని అందుకే ఆయన పేరు పెడుతున్నట్లుగా వైసిపి ప్రభుత్వం చెబుతోంది.దీనిపై రకరకాల చర్చలే జరుగుతున్నాయి.

దీనిని రాజకీయంగా వాడుకుని వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని టిడిపి జనసేన వంటి పార్టీలు ప్రయత్నిస్తుండగా,  ఈ వ్యవహారంలోకి జూనియర్ ఎన్టీఆర్ సైతం లాగారు.

      ముఖ్యంగా టిడిపి సోషల్ మీడియా అభిమానులు చాలామంది ఎన్టీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు.

తాత ఎన్టీఆర్ పేరును మార్చినా.జూనియర్ ఎన్టీఆర్ స్పందించరా అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారు.

అయితే చాలాకాలంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.గతంలో టిడిపి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించినా,  ఆ తర్వాత సినిమాల్లోనే బిజీగా ఉంటున్నారు.

ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం పై రకరకాల ప్రచారాలు జరిగినా,  ఆయన సైలెంట్ గానే ఉన్నారు.అంతకు ముందు టిడిపి అధినేత చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరుని కించపరిచే విధంగా ఏపీ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

ఈ తరహా వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదు అంటూ మాట్లాడారు.   

Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan, Ntr, Yar-Politics

    కానీ ఎక్కడా వైసిపి ప్రభుత్వాన్ని తప్పు పట్టకపోవడం వంటి వ్యాఖ్యలతో అప్పట్లోనే జూనియర్ ఎన్టీఆర్ ట్రోలింగ్ కు గురయ్యారు.మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్సార్  హెల్త్ యూనివర్సిటీగా మార్పు చేసినా,  జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదంటూ టిడిపి అభిమానులు కొందరు సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.అయితే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తారా లేదా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది.

  టిడిపి , వైసిపి వ్యవహారాలలో జూనియర్ ఎన్టీఆర్ జోక్యం చేసుకోకపోయినా, తన తాత ఎన్టీఆర్ పేరును మార్చడంపై జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా మీడియా ముఖంగా స్పందించి తన సందేశాన్ని వినిపించే అవకాశాలు ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube