‘ఉప్పెన’ విలన్‌కు చట్టపరమైన చిక్కులు తప్పవా?

తమిళనాట హీరోలపై గతంలో పలు సార్లు హిందూ మహా సభ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే.తమిళ హీరోలకు మరియు హిందూ మహాసభ మద్య ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది.

 Tamilnadu, Vijay Sethupathi, Hindu Mahasabha, Chennai, Commissioner, Arrest, Int-TeluguStop.com

తాజాగా మరోసారి ఈ వివాదం మొదలైంది.ఈసారి విలక్షణ నటుడు, స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతిపై హిందూ మహా సభ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది.

ఆయన హిందూ ధర్మంను అవమానించాడు అంటూ ఆరోపణలు చేసింది.

కొన్ని రోజుల క్రితం ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ హిందూ దేవాలయాల్లో జరిగే నిత్య కైంకర్యాలు మరియు హిందూ ధర్మ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ హిందూ మహా సభ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విజయ్‌ అన్న మాటలపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో మరింత మంది అలాంటి వ్యాఖ్యలు చేస్తారంటూ వారు ఆందోళ వ్యక్తం చేశారు.

చెన్నై కమీషనర్‌ ఈ విషయమై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ తమిళనాడు హిందూ మహాసభల అధ్యక్షుడు లేఖ రాశారు.కేసు నమోదు చేసి వెంటనే ఆయన్ను అరెస్ట్‌ చేయాల్సిందే అంటూ హిందూ మహా సభ నాయకులు అంటున్నారు.

విజయ్‌ సేతుపతి తనపై నమోదు అయిన ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారో చూడాలి.ఈ హీరోపై కేసు నమోదు అయ్యేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube