మెగా హీరోతో గొడవపై క్లారిటీ ఇచ్చిన విజయ్‌ సేతుపతి  

Vijay Sethupathi About Uppena Movie-uppena Movie,vijay Sethupathi,vishnav Tej

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్నాడు.ఈయన తన సినిమాలతో తెలుగులో కూడా మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు.అందుకే ఈయనకు నేరుగా తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు వరుసగా వస్తున్నాయి.మొదటగా విజయ్‌ సేతుపతి సైరా నరసింహారెడ్డి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆ చిత్రం సెట్స్‌ పై ఉన్న సమయంలో మెగా చిన్న మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రంలో కూడా విజయ్‌ సేతుపతి నటించేందుకు కమిట్‌ అయ్యాడు.

Vijay Sethupathi About Uppena Movie-uppena Movie,vijay Sethupathi,vishnav Tej-Vijay Sethupathi About Uppena Movie-Uppena Movie Vijay Vishnav Tej

Vijay Sethupathi About Uppena Movie-uppena Movie,vijay Sethupathi,vishnav Tej-Vijay Sethupathi About Uppena Movie-Uppena Movie Vijay Vishnav Tej

సినిమాకు సైన్‌ చేసిన విజయ్‌ సేతుపతి షూటింగ్‌కు హాజరు అయ్యేందుకు అదుగో ఇదుగో అంటూ దాటవేస్తూ వచ్చాడు.దాంతో ఈ విషయం పెద్దల వరకు వెళ్లిందని, పెద్దల సమక్షంలో మాట్లాడుకున్న తర్వాత ఈ విషయమై రాజీ కుదిరి విజయ్‌ సేతుపతి ఉప్పెన చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నట్లుగా ప్రచారం జరిగింది.

తాజాగా ఆ విషయమై విజయ్‌ సేతుపతి మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పందించి పూర్తి క్లారిటీని ఇవ్వడం జరిగింది.

ఉప్పెన చిత్రంలో నేను నటించేందుకు ఒప్పుకున్నాను.కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అయ్యింది అదే సమయంలో నేను తమిళ సినిమాలకు కమిట్‌ అయ్యాను.

ఆ కమిట్‌మెంట్స్‌ కారణంగా ఉప్పెన సినిమా షూటింగ్‌లో పాల్గొనడం ఆలస్యం అయ్యింది.ఆ సమయంలోనే కాస్త వివాదం అయ్యిందంటూ వార్తలు వచ్చాయి అని విజయ్‌ సేతుపతి చెప్పుకొచ్చాడు.చిత్ర యూనిట్‌ సభ్యులతో జరిగిన గొడవ నిజమే అంటూ విజయ్‌ సేతుపతి ఇండైరెక్ట్‌గా ఒప్పుకున్నాడు.

కాని అది అంత సీరియస్‌ అవ్వలేదని క్లారిటీ ఇచ్చాడు.ఈ చిత్రానికి సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు.