దీంతో ఉప్పెనలో విజయ్‌ పాత్రపై క్లారిటీ వచ్చినట్లేనా?  

Uppena Vaishnavu Tej Vijay Sethupathi Sukumar Buchibabu Tamil Star Vijay Sethupathi - Telugu Buchibabu, Sukumar, Tamil Star Vijay Sethupathi, Uppena, Vaishnavu Tej, Vijay Sethupathi

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం ఉప్పెన.ఈ చిత్రంకు బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నాడు.

 Uppena Vaishnavu Tej Vijay Sethupathi Sukumar Buchibabu Tamil Star Vijay Sethupathi

సుకుమార్‌ శిష్యుడు అయిన బుచ్చిబాబు ఈ సినిమాను గురువు గారి స్టైల్‌లో విభిన్నంగా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు.షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం వెయిట్‌ చేస్తుంది.

కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడినది.ఈనెల చివర్లో లేదా వచ్చే నెలలో ఈ చిత్రం వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఉప్పెనలో విజయ్‌ పాత్రపై క్లారిటీ వచ్చినట్లేనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ సినిమాలో ఆయన్ను నటింపజేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.అయితే విజయ్‌ నటిస్తున్న పాత్ర ఏంటీ.అసలు ఆయన లుక్‌ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పకుండా ఇన్ని రోజులు దాచి ఉంచారు.ఎట్టకేలకు ఈ సినిమాలోని విజయ్‌ సేతుపతి లుక్‌పై క్లారిటీ ఇచ్చారు.

లుక్‌పై మాత్రమే కాకుండా సినిమాలో విజయ్‌ రోల్‌ ఏంటీ అనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు.

విజయ్‌ విలన్‌గా కనిపించబోతున్నాడు అని ఈ పోస్టర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.చాలా సింపుల్‌గా రంగస్థలం చిత్రంలో జగపతిబాబు మాదిరిగా మాంచి విలనిజం చూపించేందుకు సిద్దంగా ఉన్నాడు అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

లుంగీలో మనోడి లుక్‌ అదిరిందని నిజమైన విలన్‌లా గాంభీరంగా ఉన్నాడంటూ సోషల్‌ మీడియాలో ఈ పోస్టర్‌కు కామెంట్స్‌ వస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు