ఓటీటీ వైపు ఉప్పెన అడుగులు..?  

Uppena Finally Towards OTT Release, Uppena, Vaishnav Tej, OTT, Buchibabu Sana, Tollywood News - Telugu Buchibabu Sana, Ott, Tollywood News, Uppena, Vaishnav Tej

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలను క్రియేట్ చేసింది.ఈ సినిమాను సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండటంతో పూర్తి యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు.

 Uppena Vaishnav Tej Ott

ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌లో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఇప్పట్లో ఈ సినిమాను రిలీజ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.

ఓటీటీ వైపు ఉప్పెన అడుగులు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీలకు అంకితం అవుతుండటం, అందులో రిలీజ్ అవుతున్న సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో, ఉప్పెన చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది.కానీ ఈ సినిమాను ఎలాగైనా థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తేల్చేసింది.

అయితే థియేటర్స్ ఇప్పట్లో తెరుచుకునే సూచనలు కనిపించడం లేదు.ఒకవేళ తెరుచుకున్న ప్రేక్షకులు థియేటర్లు ఇప్పట్లో రారు అనే వాదన గట్టిగా వినిపిస్తుండటంతో ఉప్పెన చిత్ర యూనిట్ మరోసారి ఆలోచనలో పడింది.ఈ సినిమాను ఏకంగా రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.మరి ఓ కొత్త హీరోకు ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ఏదేమైనా మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి నెలకొంటే, ఈ సినిమాను ఖచ్చితంగా ఓటీటీలోనే రిలీజ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

#Uppena #Buchibabu Sana #Vaishnav Tej #OTT

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uppena Vaishnav Tej Ott Related Telugu News,Photos/Pics,Images..