ఉప్పెనలో అదే హైలైట్.. మెగా ఫ్యాన్స్ మోసేయడం ఖాయం!

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పెన రిలీజ్‌కు రెడీ అయ్యింది.సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాలో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ తారాస్థాయిలో ఉండబోతుందని తెలుస్తోంది.

 Emotional Sequence To Be Highlight In Uppena, Uppena, Vaishnav Tej, Buchi Babu,-TeluguStop.com

ఈ సినిమా కథ ప్రేక్షకులను పూర్తిగా మైమరపించేలా ఉండనుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ఎలాంటి అంశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయనే ఆతృత ప్రేక్షకుల్లో నెలకొంది.

అయితే ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ ఈ సినిమాలో ఉండబోయే డ్రామా అంశాలు ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచే అంశాలు చాలానే ఉన్నా, అందులో ప్రత్యేకంగా నిలిచేది మాత్రం ఎమోషనల్ సీక్వెన్స్ అని తెలుస్తోంది.

ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి, హీరో వైష్ణవ్ తేజ్‌ల మధ్య వచ్చే ఓ ఎమోషనల్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్ తండ్రి పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తుండగా, హీరోతో అతడు కలిసి చేసే సీన్స్ సినిమాకు బాగా ప్లస్ పాయింట్ కానున్నాయట.

ప్రీక్లైమాక్స్‌లో వచ్చే సీన్స్ అదిరగొడతాయని చిత్ర యూనిట్ అంటోంది.అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు బలంగా మారనుంది.

మొత్తానికి ఈ సినిమాతో మెగా ఫ్యామిలీ నుండి రాబోయే హీరో అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube