ఆ జాబితాలో తొలి సినిమాగా ఉప్పెన?  

Uppena To Be The First Big Film To Release In Theatres, Uppena, Vaishnav Tej, Kriti Shetty, Devi Sri Prasad, Theatres - Telugu Devi Sri Prasad, Kriti Shetty, Theatres, Uppena, Uppena To Be The First Big Film To Release In Theatres, Vaishnav Tej

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ఉప్పెన ఎప్పుడో షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇవ్వాలని ఆశించిన వైష్ణవ్ తేజ్ కలపై కరోనా నీళ్లు జల్లింది.

TeluguStop.com - Uppena To Be The First Big Film To Release In Theatres

రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమా కరోనా కారణంగా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు.దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో తగ్గిపోయింది.

ఇక ఈ సినిమాను మరింత ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా రిలీజ్ చేసేయాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

TeluguStop.com - ఆ జాబితాలో తొలి సినిమాగా ఉప్పెన-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని థియేటర్లు లేని కారణంగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించింది.

అయితే అదంతా కేవలం పుకారే అని తేలిపోయింది.ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది.దీంతో థియేటర్లు తెరుచుకున్న తరువాత వెండితెరపై రిలీజ్ అయ్యే పెద్ద చిత్రాల్లో ఉప్పెన తొలి చిత్రంగా నిలవనుంది.ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ అంచనాలను అందుకునే కంటెంట్ ఈ సినిమాలో ఖచ్చితంగా ఉందనే ధీమాతో ఈ సినిమాను నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది.

ఇక టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనుంది.

కాగా ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా అనే ఆసక్తి ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో నెలకొంది.

ఇక నవంబర్ రెండో వారం లేదా మూడో వారంలో థియేటర్లు తెరుచుకునే అవకాశం కనిపిస్తుండటంతో ‘ఉప్పెన’లా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

#Devi Sri Prasad #Vaishnav Tej #Uppena #Theatres #UppenaTo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uppena To Be The First Big Film To Release In Theatres Related Telugu News,Photos/Pics,Images..