ఉప్పెన సినిమాకి మెగాస్టార్ షుగర్ కోటింగ్  

Uppena Special Show For Chiranjeevi - Telugu Mega Heroes, Megastar, South Cinema, Telugu Cinema, Tollywood,

మెగా హీరోల సినిమాల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు.హీరోల ఎంట్రీ సినిమాల విషయంలో కథ నుంచి శ్రద్ధ తీసుకొని మేకింగ్, ఫైనల్ అవుట్ పుట్ వరకు కేర్ తీసుకొని వారికి గ్రాండ్ ఎంట్రీ దొరికేలా చేస్తారు.

 Uppena Special Show For Chiranjeevi

అందుకే మెగా హీరోలు మేగ్జిమం సక్సెస్ ట్రాక్ తో వెళ్తున్నారు.ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమాతో పరిచయం అవుతున్నాడు.

సుకుమార్ రైటింగ్స్, మైత్రీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి.సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

ఉప్పెన సినిమాకి మెగాస్టార్ షుగర్ కోటింగ్-Movie-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన దేవిశ్రీ పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

దీంతో సినిమా మీద అంచనాలు గట్టిగానే ఉన్నాయి

ఇక లాక్ డౌన్ ముగింపు దశకి చేరుకోవడంతో త్వరలో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.ఈ నేపధ్యంలో సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇదే సమయంలో చిరంజీవికి స్పెషల్ స్క్రీనింగ్ వేయబోతున్నారు.ఇప్పటికే అవుట్ పుట్ చూసి సంతృప్తి వ్యక్తం చేసిన చిరంజీవి స్క్రీనింగ్ తరాత సినిమాలో కొన్ని కటింగ్స్ చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

చిరంజీవి సూచనలు తీసుకొని అవుట్ పుట్ లో బెటర్మెంట్ తీసుకొచ్చి రిలీజ్ కాపీ సిద్ధం చేయాలని సుకుమార్ టీం భావిస్తుంది.ఇక ఈ సినిమాకి మెగాస్టార్ షుగర్ కోటింగ్ టచ్ అప్ తో కచ్చితంగా మంచి సక్సెస్ అందుతుందని అనుకుంటున్నారు.

చిరంజీవి స్టొరీ సెలక్షన్ నుంచి ప్రతిదీ కూడా పెర్ఫెక్ట్ గా ఉంటుంది అనే అభిప్రాయం ఉన్న నేపధ్యంలో ఆయన కోసం స్పెషల్ షోకి ఉప్పెనని రెడీ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test