7 కోట్ల క్లబ్‌లో చేరిన ఉప్పెన

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉప్పెన’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Uppena Song Touches 7 Crore Views, Uppena, Vaishnav Tej, Devi Sri Prasad, Sukuma-TeluguStop.com

కాగా ఈ సినిమాకు టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే రిలీజ అయిన పాటలు ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశాయి.

కాగా ఇందులో ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే పాటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఈ పాట లిరిక్స్‌తో పాటు ట్యూన్ కూడా చాలా వినసొంపుగా ఉండటంతో శ్రోతలు ఈ పాటను పదేపదే వింటున్నారు.ఇక ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఈ పాట తాజాగా యూట్యూబ్‌లో ఏకంగా 7 కోట్ల వ్యూస్ మార్క్‌ను క్రాస్ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.ఈ పాటకు ఇంతలా రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాను సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

కాగా ఇప్పటికే ఈ సినిమాను రిలీజ్ చేయాల్సి ఉండగా లాక్‌డౌన్ కారణంగా అది వాయిదా పడింది.కాగా లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేశాక ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube