భారీ డీల్‌ను రిజెక్ట్ చేసిన ఉప్పెన  

Uppena Rejects Huge Ott Deal - Telugu Devi Sri Prasad, Ott, Sukumar Writings, Uppena, Vaishnav Tej

మెగా కాంపౌండ్ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉప్పెన’ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది.కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

 Uppena Rejects Huge Ott Deal

అటు ఉప్పెన సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న చిత్ర యూనిట్ ఎలాగైనా తమ సినిమాను రిలీజ్ చేసి అదిరిపోయే హిట్ కొట్టాలని చూస్తున్నారు.ఈ క్రమంలో లాక్‌డౌన్ ముగియగానే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
అయితే ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా సినిమాలను డిజిటల్ ప్లాట్‌ఫాంలపై రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.కాగా ఈ క్రమంలోనే ఉప్పెన సినిమాను కొనేందుకు పలు ఓటీటీ కంపెనీలు భారీ ఆఫర్లను ప్రకటించాయి.ఇందులో భాగంగా ఒక ఓటీటీ వారు ఉప్పెన సినిమాను రిలీజ్ చేసేందుకు ఏకంగా రూ.14 కోట్ల ఆఫర్ ప్రకటించారు.కానీ ఉప్పెన చిత్ర నిర్మాతలు ఈ ఆఫర్‌ను కాదని అన్నారు.దీనికి బలమైన కారణంగా కూడా ఉంది.
ఈ సినిమా కోసం వారు ఏకంగా రూ.20 కోట్ల ఖర్చు చేశారు.ఈ లెక్కన కేవలం డిజిటల్ రేటు ద్వారా తమ సినిమాకు న్యాయం జరగదని వారు భావించారు.దీంతో ఉప్పెన సినిమాను ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లలోనే రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

భారీ డీల్‌ను రిజెక్ట్ చేసిన ఉప్పెన-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు