ఉప్పెనలా దూసుకొచ్చిన వ్యూస్… 100 మిలియన్ క్లబ్ లో దేవిశ్రీ పాట  

Nee Kallu Neeli Samudram Song In Uppena Gets 100 Million, Vaishnav Tej, Sukumar, Devisri Prasad, Tollywood, Mega family - Telugu Devisri Prasad, Mega Family, Nee Kallu Neeli Samudram Song In Uppena Gets 100 Million, Sukumar, Tollywood, Vaishnav Tej

ఈ మధ్యకాలంలో తెలుగు పాటలకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ లభిస్తుంది.ఏ మాత్రం హిట్ అయిన అన్ని వర్గాల ప్రేక్షకులకి రీచ్ కావడంతో పాటు ఇతర భాషలలో కూడా ఆ సాంగ్స్ ని సంగీత అభిమానులు ఆశ్వాదిస్తున్నారు.

TeluguStop.com - Uppena Nee Kallu Neeli Samudram Song In Uppena Gets 100 Million

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అలాగే ఆ పాటలతో సరదా సరదా వీడియోలు కూడా చేస్తున్నారు.ఇతర దేశాల వారు కూడా తెలుగు పాటలని టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

TeluguStop.com - ఉప్పెనలా దూసుకొచ్చిన వ్యూస్… 100 మిలియన్ క్లబ్ లో దేవిశ్రీ పాట-Movie-Telugu Tollywood Photo Image

తెలుగు పాటలకి, ముఖ్యంగా సౌత్ పాటలకి ఈ మధ్యకాలంలో విపరీతమైన క్రేజ్ వచ్చింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి.సాయి పల్లవి నటించిన మారి సినిమాలో రౌడీ బేబీ సాంగ్ ని యుట్యూబ్ లో ఏకంగా వంద కోట్ల మంది వీక్షించడంలో ఇండియన్ చరిత్రలోనే అరుదైన రికార్డు అని చెప్పాలి.

ఇక అల్లు అర్జున్ రీసెంట్ మూవీ అల వైకుంఠపురంలో సినిమాలోని సాంగ్స్ అన్ని కూడా ఇదే రేంజ్ లో దూసుకుపోయాయి.
Nee Kallu Neeli Samudram Song In Uppena Gets 100 Millionతాజాగా మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్న వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలోని సాంగ్ కూడా రికార్డ్ స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంది.

యూట్యూబ్‌ను ఆ సాంగ్ షేక్ చేస్తోంది.ఉప్పెన చిత్రంలోని నీ క‌న్ను నీలి స‌ముద్రం పాట ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌నంత‌గా యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.ఈ రొమాంటిక్ సాంగ్ 100 మిలియ‌న్ వ్యూస్ సాధించింది.అంటే ఏకంగా ప‌ది కోట్ల మంది ఈ పాటని వీక్షించారు.

ఈ పాట‌కు బాణీలు క‌ట్టిన‌ సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ ఆదివారం బ‌ర్త్‌డే కావ‌డం విశేషం.అతని పుట్టిన రోజు సందర్భాగా వచ్చిన వంద మిలియన్ వ్యూస్ తో ఒక డిజిటల్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసి అతనికి కానుకగా ఇచ్చింది.

దేవిశ్రీ హృద‌యంతో బాణీలు కట్టి స్వరపరిచిన ఈ పాటకి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.ఈ పాట మొద‌ట్లో ఒక నిమిషం, చివ‌ర్లో అర నిమిషం పాటు ఖ‌వ్వాలీ సాంగ్‌కు జావెద్ అలీ గానం తోడైంది.

దీంతో హిందీ భాష రాని వాళ్ల‌ను సైతం ఆ గానం, భావం పాట‌లో లీనం చేసుకొంది.ఈ పాట‌కు శ్రీ‌మ‌ణి, ర‌ఖీబ్ ఆల‌మ్ చ‌క్క‌ని సాహిత్యం అందించారు.

ఈ సాహిత్యానికి తోడు దేవిశ్రీ సంగీతంతో ఉప్పెనలో ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోయింది.

#Sukumar #Vaishnav Tej #Devisri Prasad #NeeKallu #Mega Family

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uppena Nee Kallu Neeli Samudram Song In Uppena Gets 100 Million Related Telugu News,Photos/Pics,Images..