'ఉప్పెన'కు విజయ్‌ సేతుపతి వల్ల ఎన్ని కోట్ల లాభమో తెలుసా?

తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి ఉప్పెన సినిమాలో నటించడంతో ఆ సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది.మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం కాబోతున్న వైష్ణవ్‌ తేజ్ ను డామినేట్‌ చేసే విధంగా విజయ్‌ సేతుపతి పాత్ర ఉంటుందని, ప్రమోషన్‌ సమయంలో కూడా ఆయన పేరు మారు మ్రోగి పోతుంది.

 Uppena Movie Villain Vijay Sethupathi Update, Vaishnav Tej, Hero, Vijay Setupath-TeluguStop.com

విజయ్ సేతు పతి ఈ సినిమాకు ఓకే చెప్పిన సమయంలోనే సినిమా సగం సక్సెస్ అయ్యింది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.స్వయంగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

షూటింగ్ సమయంలో డేట్లతో ఇబ్బంది అయినా కూడా ఆయన కోసం ఇతర యూనిట్‌ సభ్యులకు ఇబ్బంది గా ఉన్న డేట్లను తీసుకున్నారట.అలా ఆయనకు పూర్తిగా స్వేచ్చ ఇచ్చి సినిమాను రూపొందించారు.అంతగా ఆయనకు ప్రాముఖ్యత ఇచ్చినందుకు ఖచ్చితంగా లాభం చేకూరింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఉప్పెన‘ సినిమా గురించి ఇతర భాషల్లో కూడా మంచి ఆధరణ దక్కబోతుంది.ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది.దాదాపుగా రీమేక్‌ రైట్స్ తో పది కోట్ల వరకు వచ్చినట్లుగా చెబుతున్నారు.ఈ మొత్తం కూడా ఖచ్చితంగా విజయ్‌ సేతుపతి వల్లే అంటున్నారు.ఇక ఇతర భాషల శాటిలైట్‌ రైట్స్ ద్వారా అయిదు కోట్ల వరకు వచ్చిందని అంటున్నారు.

అంటే మొత్తంగా విజయ్‌ సేతుపతి ఉప్పెన సినిమాలో నటించిన కారణంగా దాదాపుగా 15 కోట్ల వరకు నిర్మాతలకు కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.విజయ్‌ సేతుపతి నటించి ఉండకుంటే మొత్తం బిజినెస్ లో దాదాపుగా 15 కోట్ల వరకు తగ్గే అవకాశం ఉండేది అంటున్నారు.

ఆయనకు దాదాపుగా అయిదు కోట్ల వరకు పారితోషికంగా ఇచ్చి ఉంటారని అంటున్నారు.అంటే ఆయన వల్ల మరో పది కోట్ల వరకు లాభం అయినా ఉంటుంది కదా అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Telugu @iamkrithishetty, Satellite, Tollywood, Uppen, Uppena, Vaishnav Tej, Vill .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube