తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప్పెన టీమ్..

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతోనే పెద్ద సంచలనం సృషించాడు.ఈ సినిమాతో వైష్ణవ్ రాత్రికి రాత్రే పెద్ద స్టార్ హీరో ఐపోయాడు.

 Uppena Movie Team At Tirumala-TeluguStop.com

మొదటి సినిమాతోనే మంచి నటుడిగా ప్రేక్షకుల చేత మార్కులు వేయించుకున్నాడు.అంతేకాదు ఈ సినిమా హీరో, హీరోయిన్, దర్శకుడికి అందరికి ఇది డెబ్యూ మూవీనే.

ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించారు.ఈయన సుకుమార్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.ఈ సినిమాతో బుచ్చిబాబు తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు.ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

 Uppena Movie Team At Tirumala-తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప్పెన టీమ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈమె కూడా ఆకట్టుకునే అందంతో, మంచి నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది.అంతేకాదు ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి వరస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి.

Telugu Krithi Shetty, Tirumala, Tollywood, Uppena, Vaisshnav Tej-Movie

ఉప్పెన బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఉప్పెన సినిమా రిలీజ్ అయ్యి దాదాపు రెండు వారాలు అవుతున్న ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర తన హవా చూపిస్తుంది.ఈ సినిమా ఇప్పటికే 48 కోట్ల షేర్ వసూలు చేసింది.అంతేకాదు 50 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టడానికి అడుగులు వేస్తుంది.ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది.

ఉప్పెన సినిమా ఎవ్వరూ ఊహించనంత హిట్ అందుకోవడంతో టీమ్ మొత్తం తిరుమల స్వామి వారిని దర్శించుకోవడానికి కాలి నడకన బయలుదేరి శ్రీవారిని దర్శించు కున్నారు.

హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత నవీన్ అందరూ కలిసి కాలినడకన మెట్లు ఎక్కుతుండగా అభిమానులు వీడియో తీసారు.ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసారు.

వీడియో పోస్ట్ చేసిన కొద్దీ సేపటికే ఈ వీడియో వైరల్ అవుతుంది.

#Krithi Shetty #Uppena #Vaisshnav Tej #Tirumala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు