అనుష్కకు ఉప్పెన హీరోయిన్‌కు సంబంధం ఏంటీ?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క సినిమా లు చేసినా చేయకున్నా కూడా ఆమెను అభిమానించే వారు కోట్లల్లో ఉంటారు అనడం లో సందేహం లేదు.సినిమా లతో సంబంధం లేకుండా ఆమె టాలీవుడ్‌ ఆల్ టైమ్‌ స్టార్‌ హీరోయిన్‌ గా నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు.

 Uppena Movie Heroine And Anushka Shetty Relation-TeluguStop.com

ఆమె పూర్తి పేరు అనుష్క శెట్టి.ఇప్పుడు అదే పేరుతో ఉప్పెన సినిమా లో వైష్ణవ్‌ తేజ్ కు జోడీగా నటించింది కృతి శెట్టి.

హీరోయిన్‌ గా కృతి శెట్టి మొదటి సినిమా విడుదల కాకుండేనే టాలీవుడ్‌ లో స్టార్‌ గా ఎదిగి పోయింది.ఆమె హీరోయిన్ గా నటించిన ఉప్పెన సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న నేపథ్యంలో ఆమెకు ఏకంగా అయిదు ఆరు సినిమా ల ఆఫర్లు వచ్చాయి.

 Uppena Movie Heroine And Anushka Shetty Relation-అనుష్కకు ఉప్పెన హీరోయిన్‌కు సంబంధం ఏంటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు ఆ సినిమా లతో కృతి శెట్టి మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ ఇన్ టాలీవుడ్ అని పేరు దక్కించుకుంది.

ఈ సమయంలోనే కొందరు నెటిజన్స్‌ అనుష్క శెట్టికి కృతి శెట్టికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

గూగుల్‌ లో వీరిద్దరి పేరుతో సెర్చ్‌ చేస్తున్నారు.ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని గూగుల్ ను అడుగుతుంటే నో ఇన్ఫర్మేషన్ అంటూ సమాధానం వస్తుంది.

ఇద్దరి పేర్లలో కూడా శెట్టి ఉన్నంత మాత్రాన సంబంధం ఉండాలని ఏమీ లేదు.ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గంకు అయ్యి ఉంటారు అనేది కొందరి అభిప్రాయం.

అనుష్క గా కర్ణాటకకు చెందినది కాని కృతి శెట్టి మాత్రం మరో ప్రాంతంకు చెందిన అమ్మాయి.కనుక వీరిద్దరి మద్య పేర్ల మద్య సంబంధం తప్ప ఇతర సంబంధం ఏమీ లేదు అంటున్నారు.

తక్కువ సమయంలో ఎక్కువగా ఆధరణ దక్కించుకున్న హీరోయిన్‌ గా హీరోయిన్‌ గా కృతి శెట్టి గుర్తింపు పొందింది.గతంలో అనుష్క కూడా చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.

ఈ రెండు సంబంధాలు తప్ప ఇద్దరి మద్య వేరే రిలేషన్‌ అయితే ఉండక పోవచ్చు అంటున్నారు.

#Anushka #UppenaMovie #Krithy Shetty #Uppena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు