వైష్ణవ్‌ తేజ్ 3వ సినిమా కథ అంత సులభంగా ఓకే అయ్యేలా లేదు, మార్పుల మీద మార్పులు

మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ ఉప్పెన సూపర్ డూపర్ హిట్‌ అయిన నేపథ్యంలో అప్పుడే ఆయనపై ఒత్తిడి తీవ్రంగా పడుతోంది.ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అయినా కూడా ఆ సినిమా హీరోపై ఒత్తడి తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది.

 Uppena Movie Hero Vaishnav Tej Next Film Story Not Yet Fix , Uppena, Vaishnav Te-TeluguStop.com

అలాగే ఉప్పెన సెన్షేషనల్‌ సక్సెస్‌ అవ్వడంతో వైష్ణవ్ తేజ్ పై తీవ్రమైన ఒత్తిడి ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందులోనూ మెగా హీరో అవ్వడంతో వైష్ణవ్‌ తేజ్‌ పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.

కనుక తదుపరి సినిమా ల విషయమై ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకులు ఆయనతో సినిమాను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అందులో భాగంగా కొన్ని కథలు కూడా వారు వినిపించారని తెలుస్తోంది.ప్రముఖ దర్శకుడు ఒకరు వైష్ణవ్‌ తేజ్ తో సినిమా కోసం కథను సిద్దం చేయగా ఇప్పటికే మెగా ఫ్యామిలీలో చాలా మందికి వినిపించినా కూడా ఓకే అవ్వలేదని తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీ హీరో ను కథతో ఒప్పించాలంటే తతంగం చాలానే ఉంటుంది.చిరంజీవి మొదలుకుని చాలా మంది కూడా కథను నచ్చాల్సి ఉంటుంది.అందుకే వైష్ణవ్‌ తేజ్ కోసం రెడీ చేసిన కథ కూడా ఇప్పుడు మార్పులు చేర్పులు అంటూ అటు ఇటు తిరుగుతున్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఉప్పెన సూపర్‌ హిట్‌ అయ్యింది కనుక ఆ రేంజ్ లో తదుపరి సినిమా కూడా ఉండాలని వైష్ణవ్‌ తేజ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అందుకే కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు కథను ది బెస్ట్ గా ఉండేలా ఎంపిక చేయాలని మెగా ఫ్యామిలీ భావిస్తుందట.అందుకే మార్పులు మీద మార్పలు చేయిస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది.

ఇక వైష్ణవ్‌ తేజ్‌ ఇప్పటికే రెండవ సినిమా క్రిష్‌ దర్శకత్వంలో మొదలు పెట్టడం పూర్తి చేయడం జరిగింది.ఉప్పెన విడుదలకు ముందే క్రిష్‌ తో మూవీని పూర్తి చేసిన వైష్ణవ్‌ తేజ్ మూడవ సినిమా విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

కథలు వింటూ టైమ్ స్పెండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.వైష్ణవ్‌ మూడవ సినిమా ప్రకటన కోసం మెగా అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube