ఏంటి.. ఆ మెగా యంగ్ హీరో కి బట్ట తల ఉందా....?

తెలుగులో నూతన దర్శకుడు బుచ్చి బాబు సాన దర్శకత్వం వహించిన “ఉప్పెన” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన “మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వచ్చీ రావడంతోనే వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రంతో 50 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి పలు రికార్డులను నెలకొల్పాడు.

 Uppena Movie Fame Vaishnav Tej Bald Head Video Viral-TeluguStop.com

దీంతో ఈ కుర్రహీరోకి ప్రస్తుతం సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

అయితే తాజాగా వైష్ణవ్ తేజ్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

 Uppena Movie Fame Vaishnav Tej Bald Head Video Viral-ఏంటి.. ఆ మెగా యంగ్ హీరో కి బట్ట తల ఉందా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 అయితే అంతగా ఆ వీడియోలో ఏముందంటే వైష్ణవ్ తేజ్ సీసాతో మ్యాజిక్ చేశాడు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ వీడియోలో వైష్ణవ్ తేజ్ కొంతమేర గుండు చేయించుకుని బట్ట తలతో కనిపిస్తున్నాడు.ఈ వీడియో ఎప్పుడో నాలుగేళ్ల క్రితం తీసినప్పటికీ  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

దీంతో కొందరు మీమ్ క్రియేటర్స్ ఈ వీడియోని  సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయ్యాయి.దీంతో తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా హీరోగా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

#VaishnavTej #UppenaMovie #Vaishnav Tej #VaishnavTej #Mega Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు