ఇంకా ఒక్కటి కూడా విడుదల కాలేదు... అప్పుడే స్టార్ హీరోలతో ఆఫర్లు...

టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ “ఉప్పెన” అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు.

 Uppena Movie Fame Krithi Shetty Got A Another Tollywood Offer-TeluguStop.com

అయితే ఈ చిత్రానికి దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నటువంటి కృతి శెట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించే మరో అవకాశం దక్కించుకుంది.

అయితే ప్రస్తుతం హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత బన్నీవాసు నిర్మిస్తున్నారు.అయితే ఈ అమ్మడు ప్రస్తుతం నటిస్తున్నటువంటి “ఉప్పెన” చిత్రంలోని “నీ కన్ను నీలి సముద్రం” అనే పాట బాగానే పాపులర్ అయింది.దీంతో దర్శకుడు సూర్య ప్రతాప్ కృతి శెట్టీని తీసుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Krithi Shetty, Nikhil, Uppenakrithi-Movie

అయితే ఈ అమ్మడు సోషల్ మీడియా లో కూడా ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతోంది.ఇప్పటికే కుర్రకారు కూడా ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యారు.దీంతో ఈ అమ్మడు ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.దీనివల్ల ఉప్పెన చిత్రం ప్రమోషన్స్ కి కూడా ఈ విషయం బాగానే ఉపయోగపడుతుంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube