ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

కొంతమంది హీరోయిన్లు సినిమా పరిశ్రమకి  వచ్చి రావడంతో అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు.ఇలా వచ్చిన సాయి పల్లవి, పూజ హెగ్డే, తదితర హీరోయిన్లు ఎంతోమందికి కలలరాణి మారారు.

 Uppena Movie Fame Krithi Shetty Childhood Photos Talk, Krithi Shetty, Telugu Her-TeluguStop.com

 అయితే ఇటీవలే తెలుగులో ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన “ఉప్పెన” చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముంబై యంగ్ హీరోయిన్ కృతి శెట్టి అలియాస్ బేబమ్మ కూడా ఈ కోవకే చెందుతుంది.ఈ అమ్మడికి ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజ్ మరియు  ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు.

అయితే కృతి శెట్టి సినిమాల్లో నటించడానికంటే ముందే పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తుల ప్రకటనలలో నటించింది. ఇందులో ముఖ్యంగా శ్రీలంక దేశంలోని లైఫ్ బాయ్ సబ్బు ప్రకటనల్లో నటించింది.దీంతో ప్రస్తుతం ఈ లైఫ్ బాయ్ ప్రకటన యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతోంది.అంతేకాక ఈ అమ్మడి గురించి టాలీవుడ్ నెటిజన్లు కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వెతుకుతున్నారు.

అంతేకాక కృతి శెట్టి చిన్నప్పటి ఫోటోలను తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ తెగ ట్రెండింగ్ చేస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపు 4.50 లక్షల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కృతి శెట్టి కి సోషల్ మీడియాలో మాధ్యమాలలో ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏమిటో అని.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కృతి శెట్టి తెలుగులో బాగానే సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

మరో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ పదహారేళ్ళ వయసులోనే సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదని, కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటే కృతి శెట్టి అలియాస్ బేబమ్మ కి హీరోయిన్ గా మంచి భవిష్యత్తు ఉంటుందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube