ఉప్పెన సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.ఇలా మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.
ఇలా ప్రతి సినిమాలోనూ ఎంతో విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈమెను అభిమానులు కూడా ఎంతగానో ఆదరిస్తున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా కృతి శెట్టి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎంతో విభిన్నమైన పాత్రలో నటించానని, ఇలా విభిన్నమైన కథలు వస్తేనే తను నటిస్తానని లేదంటే ఆ సినిమాలను నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తానని తెలిపారు.అయితే కెరీర్ పరంగా తనకు ఒక కళ ఉందని ఈ సందర్భంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించారు.
ఎప్పటికైనా ఒక రాకుమారి పాత్రలో నటించడమే తన కల,అలాంటి పాత్ర కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని తన కల ఎప్పుడు నెరవేరుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని కృతి శెట్టి తెలిపారు.

ఇంటర్వ్యూ సందర్భంగా కృతి శెట్టి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి బయటపెట్టారు.అయితే త్వరలోనే ఈమె కోరిక నెరవేరాలని కోరుకుందాం.ఇక ప్రస్తుతం ఈమె సినిమాల విషయానికి వస్తే లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని సరసన ది వారియర్ చిత్రంలో నటిస్తున్నారు.
తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.
