నాగ చైతన్యపై ఆశలు పెట్టుకున్న బేబమ్మ.. ఆ ఒక్కటి హిట్‌ అయ్యేనా?

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన కృతి శెట్టి వరుసగా నాలుగు ఐదు సినిమాలతో మంచి పేరును సొంతం చేసుకుంది.కానీ ఈ మధ్య కాలం లో కృతి శెట్టి కి సక్సెస్ పడలేదు.

 Uppena Heroine Krithy Shetty Hopes On Custody Movie,krithi Shetty,uppena,custody-TeluguStop.com

దాంతో అవకాశాలు కూడా ఒక్క సారిగా తగ్గాయి.సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన మొదటి సంవత్సరం లోనే ఏకంగా 10 సినిమాలకు కమిట్‌ అయిన రికార్డు కేవలం కృతి శెట్టి మాత్రమే దక్కుతుంది.

అలాంటి రికార్డు సొంతం చేసుకున్న ఉప్పెన బ్యూటీ కృతి ఈ మధ్య కాలం లో కొత్త సినిమాలకు కమిట్ అవ్వక పోవడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం నాగ చైతన్య నటిస్తున్న కస్టడీ సినిమా లో హీరోయిన్ గా ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెలిసిందే.

Telugu Bangarraju, Krithi Shetty, Naga Chaitanya, Telugu, Tollywood, Uppena-Movi

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం లో రూపొందుతున్న కస్టడీ సినిమా లో కృతి శెట్టి యొక్క పాత్ర విభిన్నంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది.అంతే కాకుండా సినిమా కు సంబంధించిన అన్ని విషయాలు కృతి శెట్టి కి అనుకూలంగా ఉండబోతున్నాయట.అందుకే కస్టడీ సినిమా తర్వాత కృతి శెట్టి తిరిగి టాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bangarraju, Krithi Shetty, Naga Chaitanya, Telugu, Tollywood, Uppena-Movi

ఉప్పెన స్థాయి లో కస్టడీ సక్సెస్ కాకున్నా కూడా ఒక మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే కృతి శెట్టి మరో ఐదారు సినిమాలకు వరుసగా సక్సెస్ దక్కకుండా కంటిన్యూగా ఆఫర్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి కృతి శెట్టి కి కస్టడీ సినిమా సక్సెస్ అయ్యే నా నాగ చైతన్య పై పెట్టుకున్న ఆశలు నెరవేరేనా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube