అంతగా ఈ అమ్మాయిలో ఉన్న ప్రత్యేకత ఏంటీ?

కొంత మంది హీరోయిన్స్‌ వరుసగా సక్సెస్‌ లు పడుతున్నా కూడా కొత్త సినిమాల కోసం ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది.చాలా మంది హీరోయిన్స్‌ విషయంలో అలాగే జరిగింది.

 Uppena Heroine Krithy Shetty Gets 5 Movie Offers. Hero Nani, Shyam Singha Roy,-TeluguStop.com

కొందరు మాత్రం సక్సెస్‌ లు కాకున్నా కూడా అదృష్టం కొద్ది ఆఫర్లు దక్కించుకుంటారు.కాని ఎవరు కూడా సినిమాలు విడుదల కాకుండానే చేతిలో అరడజను సినిమాలు దక్కించుకోరు.

ఒక్క సినిమాను కూడా విడుదల చేయని హీరోయిన్‌ ఏకంగా చేతిలో అరడజను సినిమాలు పెట్టుకుంది అంటే ఆమె స్టామినా ఏంటో చెప్పకనే చెప్పవచ్చు.ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి.

కరోనా కారణంగా ఈ ఏడాది ఆరంభంలో విడుదల అవ్వాల్సిన ఉప్పెన సినిమా ఇంకా విడుదల అవ్వడం లేదు.వచ్చే ఏడాది వరకు ఈ సినిమా వాయిదా వేస్తూనే ఉంటారేమో.

ఈ సినిమాలో నటించిన కృతి శెట్టి మాత్రం ఆగడం లేదు.సినిమా ఆగినా ఈమె కెరీర్‌ ఆగిపోలేదు.

Telugu Krithi Shetty, Nanishyam, Sudheer Babu, Telugu, Uppena, Vaishnav Tej-Late

కృతి శెట్టి ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తోంది.మరి కొన్ని కూడా చర్చల దశలో ఉన్నాయి.వచ్చే ఏడాది ఈమె నటించిన ఆరు సినిమాలు బాక్సాఫీస్‌ ముందుకు రాబోతున్నాయి.

ఇంతలా ఒక హీరోయిన్‌ సందడి చేయడం ఇదే మొదటి సారి అయ్యి ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కరోనా వల్ల ఆమెకు కలిసి వచ్చిందనే చాలా మంది అంటున్నారు.

ఉప్పెన సినిమా ఫలితం బెడిసి కొడితే ఇప్పటి వరకు ఆమెకు ఇన్ని సినిమాలు వచ్చేవి కాదు.ఒక వేళ సినిమా సక్సెస్‌ అయినా కూడా ఆమెకు ఇన్ని సినిమాలు వచ్చేవి అనడంలో అనుమానమే అంటున్నారు.

ఉప్పెన సినిమా నిలిచి పోవడం ఆ సినిమా టీజర్‌ మరియు పాటల్లో క్యూట్ గా కనిపించి ఆకట్టుకోవడం వల్లే కృతి శెట్టికి ఇంతగా ఆఫర్లు వస్తున్నాయని ప్రత్యేకత అంటూ ఏమీ లేదు అని ఇండస్ట్రీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కృతి శెట్టిని సోషల్‌ మీడియాలో అధికంగా ప్రమోట్‌ చేయడం వల్ల కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube