ఉప్పెన సక్సెస్ తో అరుదైన రికార్డ్‌ ను సొంతం చేసుకున్న కృతి శెట్టి.. ఏంటో తెలుసా?

ఒక్క సినిమా ముగ్గురును సూపర్‌ స్టార్‌ లుగా నిలబెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అదే సినిమా అంటే ఠక్కున ఉప్పెన అంటూ అంతా అంటున్నారు.

 Uppena Heroine Krithy Shetty Doing Six Moives In Tollywood And Kollywood-TeluguStop.com

ఉప్పెన సినిమా సూపర్ హిట్ అవ్వడంతో హీరో వైష్ణవ్‌ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి మరియు దర్శకుడు బుచ్చి బాబు లు ముగ్గురు కూడా మస్త్‌ బిజీ అయ్యారు.వైష్ణవ్‌ తేజ్‌ తన పారితోషికం ను అమాంతం పెంచేయడంతో పాటు వరుసగా సినిమా లకు కమిట్‌ అవుతున్నాడు.

ఇక బుచ్చి బాబు దర్శకత్వంలో సినిమా లు చేసేందుకు పెద్ద ఎత్తున హీరోలు మరియు నిర్మాతలు ఆయనకు అడ్వాన్స్ లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు, వస్తున్నారు.ఇక కృతి శెట్టి జోరు వారిద్దరిని మించి ఉంది.

 Uppena Heroine Krithy Shetty Doing Six Moives In Tollywood And Kollywood-ఉప్పెన సక్సెస్ తో అరుదైన రికార్డ్‌ ను సొంతం చేసుకున్న కృతి శెట్టి.. ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఉప్పెన రిలీజ్‌ కు ముందే వైష్ణవ్‌ తేజ్ ఏకంగా మూడు సినిమాలకు కమిట్‌ అయ్యింది.ఆ మూడు సినిమా లతో పాటు ఇప్పుడు మరో సినిమాలను కన్ఫర్మ్‌ చేసింది.

ఒక్క సినిమా విడుదల తో ఆరు సినిమా ల ఛాన్స్ ను దక్కించుకున్న మరే హీరోయిన్‌ లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అంటున్నారు.

కృతి శెట్టి నాని మరియు రామ్‌ సినిమా ల్లో ఇప్పటికే నటిస్తోంది.

మరో నాలుగు సినిమాలు చర్చలు కూడా పూర్తి అయ్యాయి.ఈ ఆరు సినిమాలకు మొత్తం కలిపి నాలుగు కోట్లకు పైగా పారితోషికాలను దక్కించుకుంటుంది.

ఈ ఆరు సినిమాలు కూడా ఏడాదిన్నర గ్యాప్‌ లోనే విడుదల అవ్వబోతున్నాయి.అంటే పారితోషికం పరంగా కూడా ఎంట్రీ ఇచ్చిన ఏడాదిన్నరలోనే ఏకంగా అయిదు కోట్లకు పైగా పారితోషికంను తీసుకున్న ఘనత ఈ అమ్మడికి దక్కబోతుంది.

ఇలాంటి అరుదైన రికార్డును ఇప్పటి వరకు ఏ హీరోయిన్‌ దక్కించుకోలేదు, ముందు ముందు కూడా ఏ హీరోయిన్‌ ఈ రికార్డును దక్కించుకునే అవకాశం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం ఈమె సినిమాల విషయమై పదే పదే చర్చ జరుగుతోంది.

అది ఈమె రేంజ్ ను మరింతగా పెంచుతుందని అంటున్నారు.

#Uppena Heroine #KrithyShetty #KrithyShetty #Krithy Shetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు