కన్ఫర్మ్‌ : అక్కినేని సినిమాలో ఉప్పెన బ్యూటీ

ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి.18 ఏళ్ల కూడా రాకుండానే వంద కోట్ల సినిమాలో నటించేసి ప్రస్తుతం సినిమాకు కోటిన్నర నుండి రెండు కోట్లు పారితోషికంను అందుకుంటుంది.సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఏకంగా సినిమా ల ద్వారా పది కోట్ల వరకు సంపాదించిన ముద్దుగుమ్మ కృతి శెట్టి.ఈ అమ్మడు తెలుగు లో ప్రస్తుతం టాప్ స్టార్‌ హీరోయిన్ అనడంలో సందేహం లేదు.ఎందుకంటే ఈమె చేస్తున్న సినిమాల సంఖ్య అలా ఉంది.

 Uppena Heroine Krithi Shetty New Movie Bangarraju-TeluguStop.com

ఉప్పెన సినిమా నుండి మొదలుకుని ఇప్పటి వరకు ఆమె వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది.

ఉప్పెన రిలీజ్ కు ముందు రామ్‌ హీరోగా రూపొందబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.మరో వైపు నానితో ఒక సినిమాను ఈమె చేస్తున్న విషయం తెల్సిందే.తాజాగా ఈమె అక్కినేని హీరో నాగచైతన్య తో బంగార్రాజు సినిమాలో నటిస్తోంది.

 Uppena Heroine Krithi Shetty New Movie Bangarraju-కన్ఫర్మ్‌ : అక్కినేని సినిమాలో ఉప్పెన బ్యూటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరో వైపు బుచ్చి బాబు దర్శకత్వంలో రాబోతున్న ఒక సినిమాలో ఈమె హీరోయిన్ గా ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.

ఇవి కాకుండానే మరో రెండు మూడు సినిమాలు కూడా ఈమె నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బంగార్రాజు సినిమా షూటింగ్ లో ఈమె వచ్చే నెలలో జాయిన్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.నాగచైతన్య మరియు నాగార్జునలు నటించబోతున్న బంగర్రాజు సినిమా తో ఈమె క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం అంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 ఉప్పెన సినిమా తర్వాత ఇప్పటి వరకు ఈమె నాలుగు అయిదు సినిమాలను కన్ఫర్మ్‌ చేసింది.అందులో రెండు సినిమాలు షూటింగ్‌ పూర్తి అయ్యాయి.రెండు షూటింగ్‌ దశలో ఉన్నాయి.మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి.

మొత్తానికి ఈమె బిజీ బిజీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

#Naga Chaitanya #Krithi Shetty #Uppena #Bangarraju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు