ఉప్పెన హీరో రెండవ సినిమా విడుదలకు ముందే 4 రెట్ల లాభం, ఎంతో తెలిస్తే అవాక్కవుతారు

మెగా ఫ్యామిలీ హీరో అంటే ఇండస్ట్రీ లో ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు.అదే సక్సెస్‌ అయిన హీరోల సినిమాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది.

 Uppena Hero Viashnav Tej And Krish Film Konda Polam Pre Release Business-TeluguStop.com

ఉప్పెన సినిమాతో మొదటి సక్సెస్‌ ను దక్కించుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఇప్పటికే తన రెండవ సినిమా ను క్రిష్ దర్శకత్వంలో చేసిన విషయం తెల్సిందే.కేవలం రెండున్న నెలల్లోనే ఈ సినిమా ను దర్శకుడు క్రిష్‌ పూర్తి చేశాడు.

కొండ పొలం అనే నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమా కమర్షియల్‌ ఎలిమెంట్స్ కు కాస్త దూరంగా ఉన్నా కూడా మాస్ క్లాస్ ఆడియన్స్‌ ను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు.సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయినా కూడా కాస్త ఆలస్యంగానే ఈ సినిమాను విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు.

 Uppena Hero Viashnav Tej And Krish Film Konda Polam Pre Release Business-ఉప్పెన హీరో రెండవ సినిమా విడుదలకు ముందే 4 రెట్ల లాభం, ఎంతో తెలిస్తే అవాక్కవుతారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొండ పొలం సినిమా లో నటించినందుకు గాను వైష్ణవ్ తేజ్‌ దాదాపుగా 75 లక్షల రూపాయలు పారితోషికంగా దక్కించుకున్నాడట.ఈ మొత్తం సినిమా ను దర్శకుడు క్రిష్‌ కేవలం నాలుగు కోట్ల లోపు బ డ్జెట్‌ తో పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది.

ఉప్పెన సినిమా సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో కొండ పొలం సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అందుకే ఈ సినిమా ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ లక్ష్మణ్‌ ఏకంగా రూ.11.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాల థియేట్రికల్‌ రైట్స్ తోనే ఇంతగా వస్తే ఓటీటీ, శాటిలైట్, ఆడియో, డబ్బింగ్‌, రీమేక్‌ రైట్స్ రూపంలో మరెంతగా వస్తాయో ఊహించుకోవచ్చు.మరో పది కోట్ల వరకు వచ్చే అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

అంటే సినిమా విడుదలకు ముందే ఈ సినిమా కు నాలుగు రెట్ల లాభంకు ఎక్కువగానే వస్తున్నట్లుగా ఈ లెక్కలను బట్టి అర్థం అవుతుంది.రెండవ సినిమాతోనే నిర్మాతలకు కాసుల పంట పండించిన హీరోగా వైష్ణవ్‌ తేజ్ రికార్డు సృస్టించాడు.

.

#FilmNews #Krish #Vaishnav Tej #PreRelease #Konda Polam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు