ఉప్పెన హీరో మూడవ సినిమా అప్‌డేట్‌ ఏంటీ?

మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు వస్తూనే ఉంటారు.కాని కొద్ది మంది మాత్రమే సక్సెస్‌ లను దక్కించుకుంటారు.

 Uppena Hero Vaishnav Tej 3rd Movie Update-TeluguStop.com

వారు మెగాస్టార్‌ చిరంజీవి వారసత్వంను కొనసాగిస్తారనే నమ్మకం కలుగుతుంది.అలా నమ్మకం కలిగించిన వారిలో ఒకరు వైష్ణవ్‌ తేజ్ అనడంలో సందేహం లేదు.

మెగా బ్రదర్స్ మేనల్లుడు అనే ఇమేజ్‌ ను పక్కన పెట్టి ఆయన మొదటి సినిమా ఉప్పెన కోసం పడ్డ కష్టం ను ఏ ఒక్కరు మర్చిపోలేరు.అద్బుతమైన విజయాన్ని ఉప్పెనతో దక్కించుకున్న వైష్ణవ్‌ తేజ్ ముందు ముందు మామయ్యల మద్దతు లేకుండానే స్టార్‌ హీరోగా మంచి గుర్తింపు దక్కించుకుంటాడనే నమ్మకం అందరు వ్యక్తం చేస్తున్నారు.

 Uppena Hero Vaishnav Tej 3rd Movie Update-ఉప్పెన హీరో మూడవ సినిమా అప్‌డేట్‌ ఏంటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఉప్పెన సినిమా తో మొదటి విజయాన్ని సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్‌ ఎంట్రీ భారీగా ఇచ్చాడు.మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన వైష్ణవ్ తేజ్ ముందు ముందు మరిన్ని సినిమాల్లో సందడి చేయబోతున్నాడు.

ఉప్పెన విడుదల కాక ముందే వైష్ణవ్‌ చేసిన రెండవ సినిమా కొండపొలం.క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్‌ మూవీగా నిలిచింది.

కొండ పొలం సినిమా కమర్షియల్ గా నిరాశ పర్చినా కూడా నటుడిగా వైష్ణవ్ తేజ్ కు మంచి పేరును తెచ్చి పెట్టింది.ఇక ప్రస్తుతం మెగా అభిమానులు వైష్ణవ్ మూడవ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.

ఇప్పటికే గిరీషయ్య దర్శకత్వంలో సినిమా మొదలయ్యింది.అర్జున్ రెడ్డిని తమిళంలో తెరకెక్కించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న గిరీశయ్య తెలుగు లో భారీ ఎంట్రీ ఇవ్వడం కోసం వైష్ణవ్ తో జత కట్టాడు.

ఇప్పటికే షూటింగ్‌ కార్యక్రమాలు మొదలు అయిన వైష్ణవ్ మూడవ సినిమా షూటింగ్‌ మెల్లగా సాగుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుందట.సినిమాను వచ్చే సమ్మర్ తర్వాత విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రివీల్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

#Herof #Girishayya #Tamil Arjun #Vaishnav Tej #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube