మెగా హీరో ఎంట్రీకి అడ్డు పడుతున్నది ఎవరో తెలుసా?  

Uppena Gets Shock From Rana Daggubati And Anushka - Telugu Anushka, Rana Daggubati, Telugu Movie News, Uppena, Vaishnav Tej

మెగా కాంపౌండ్ నుండి వస్తున్న మరో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉప్పెన’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Uppena Gets Shock From Rana Daggubati And Anushka

కాగా ఈ సినిమాతో తన ఎంట్రీని అదిరిపోయే విధంగా ఉండాలని వైష్ణవ్ తేజ్‌ భావిస్తున్నాడు.

అయితే వైష్ణవ్ తేజ్ ఆశలపై ఇద్దరు స్టార్లు నీళ్లు జల్లారు.

ఏప్రిల్ 2వ తేదీన స్టార్ బ్యూటీ అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం గతంలోనే రిలీజ్ కావాల్సి ఉండగా అది వరుసగా వాయిదా పడుతూ వచ్చింది.కాగా తాజాగా ఈ సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇక రానా దగ్గుబాటి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ అరణ్య(హాతీ మేరే సాతీ) కూడా తన రిలీజ్ డేట్‌ను ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఏదేమైనా మెగా హీరో ఎంట్రీకి ఇద్దరు స్టార్లు అడ్డుపడుతుండటంతో ఉప్పెన చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది.మరి వైష్ణవ్ తేజ్ చిత్రం రిలీజ్‌ ఏప్రిల్ 2న ఉంటుందా లేక వాయిదా పడుతుందా అనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ఏదేమైనా ఈ విషయంపై ఉప్పెన యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి అంటున్నాయి సినీ వర్గాలు.

.

#Rana Daggubati #Uppena #Anushka #Vaishnav Tej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uppena Gets Shock From Rana Daggubati And Anushka Related Telugu News,Photos/Pics,Images..