రవితేజ క్రాక్ ని బీట్ చేసిన ఉప్పెన

కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అద్బుతమైన విజయాన్ని అందుకున్న సూపర్ హిట్ చిత్రం ఉప్పెన. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జోడీగా విజయ్ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడుగా పరిచయం అయ్యాడు.

 Uppena Gets Highest Trp Ratings In World Television Premiere, Vaishnav Tej, Krac-TeluguStop.com

ఇక ఈ సినిమా మైత్రీ వారికి ఏకంగా వంద కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చింది.మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయిన హీరోగా అరుదైన రికార్డ్ ని వైష్ణవ్ తేజ్ సొంతం చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాని వరల్డ్ ప్రీమియర్ షోగా స్టార్ మా చానల్ లో టెలికాస్ట్ చేశారు.అయితే పెద్ద హీరోల రేంజ్ లో టీఆర్పీ రేటింగ్స్ రాకున్నా టీవీ ప్రేక్షకుల ఆదరణ మాత్రం భాగానే దక్కించుకుందని తెలుస్తుంది.

తాజాగా స్టార్ మా ఈ సినిమా టీఆర్పీ రేటింగ్స్ ని బయట పెట్టింది.

Telugu Krack, Krithi Shetty, Raviteja, Maa, Sukumar, Uppena, Vaishnav Tej, Premi

ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమాలని టీఆర్పీ రేటింగ్స్ లో ఉప్పెన సినిమా బీట్ చేయడం బీట్ చేయడం విశేషం. క్రాక్ సినిమాకి 11.1 టీఆర్పీ రేటింగ్ మాత్రమే రాగా ఉప్పెన సినిమా ఏకంగా 18.5 పాయింట్స్ రేటింగ్ వచ్చింది.చిన్న హీరోల సినిమాలలో ఇది హైయెస్ట్ రేటింగ్ అని చెప్పాలి.

దీనికంటే ముందు వరుసలో అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరూ సినిమాలు మాత్రమే ఈ మధ్యకాలంలో ఉన్నాయి.మొతానికి థియేటర్స్ లో ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న ఉప్పెన సినిమా శాటిలైట్ ప్రేక్షకులని కూడా భాగానే మెప్పించిందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఉప్పెన సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కి క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు నెక్స్ట్ సినిమా అవకాశం ఎన్టీఆర్ ఇచ్చాడని తెలుస్తుంది.అలాగే వైష్ణవ్ తేజ్ చేతిలో ఇప్పుడు అరడజను వరకు సినిమాలు ఉన్నాయి.

కృతి శెట్టి కూడా 4 సినిమాలకి కమిట్ అయ్యింది.మొత్తానికి ఉప్పెన వీరి ముగ్గురి భవిష్యత్తుని పూర్తిగా మార్చేసిందని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube