అప్పట్లో మహేష్ బాబుకు క్లాప్ కొట్టిన అతను ఇప్పుడు ఫేమస్ డైరెక్టర్.. ఎవరో తెలుసా?

ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో మహేష్ బాబు ఏదో సినిమా షూటింగ్ లో ఉన్నట్టున్నాడు కదా.అవునండి ఇది మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమా షూటింగ్ సమయం అది.

 Uppena Director Sounds Clap On Maheshbabu Pic Goes Viral, Uppena Director, Sound-TeluguStop.com

ఇక ఈ షూటింగ్ సమయంలో ఏదో ఒక సీన్ కోసం మహేష్ బాబు సిద్ధమవుతుండగా అక్కడ ఓ మామూలు వ్యక్తి వచ్చి క్లాప్ కొడుతున్నట్టు కనిపిస్తున్నాడు.ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో అనుకోకండి.

బాగా పరిశీలిస్తే ఆయన ఇప్పుడు ఒక్క సినిమాతో ఓ రేంజ్ లో పేరు దక్కించుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన.చూడటానికి బుచ్చిబాబు అప్పుడెంతా బక్కపలచగా కనిపిస్తున్నాడో మీరు కూడా ఓ కన్నేయండి.

అయితే వన్ నేనొక్కడినే సినిమాలో సుకుమార్ దర్శకత్వం వహించారు.ఇక ఆ సమయంలో బుచ్చిబాబు సన సుకుమార్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న సమయం అది.దీంతో సుకుమార్ తన శిష్యుడు బుచ్చిబాబు తో ఈ సినిమాకి క్లాప్ కొట్టించాడు.కానీ ఇప్పుడు బుచ్చిబాబు రేంజ్ అక్కడ లేదు ఏకంగా మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు స్థానంలో నిలిచాడు.

Telugu Buchibabu, Maheshbabu, Sounds Clap, Uppena-Movie

తాజాగా విడుదలైన సినిమా ఉప్పెన.ఈ సినిమా ప్రస్తుతం బాగా జోరుగా నడుస్తుంది.ఇక ఈ సినిమాకే బుచ్చిబాబు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.ఇందులో కృతి శెట్టి, వైష్ణవి తేజ్ నటీనటులుగా తొలిసారిగా తెరకెక్కించాడు బుచ్చిబాబు.అంతేకాకుండా బుచ్చిబాబు కూడా తొలిసారిగా తన దర్శకత్వంను ఈ సినిమాతోనే మొదలు పెట్టాడు.సుకుమార్ శిష్యుడు గా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు సన రేంజ్ ఇప్పుడు మారడంతో.

మరో యంగ్ హీరోలు కూడా ఈయన దర్శకత్వం కోసం ఎదురుచూస్తున్నారట.మొత్తానికి తన స్థానం మారడంతో స్థాయి కూడా మారిందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube