వేల సంపాదన వదిలి రూ.500 కోసం ఆ పని చేసిన సుకుమార్..?

అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య సినిమాతో దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టి వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు సుకుమార్.రామ్ చరణ్ తో సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ కాగా సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా తెరకెక్కిస్తున్నారు.సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చిబాబు సన డైరెక్షన్ లో తెరకెక్కిన ఉప్పెన రేపు విడుదల కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న బుచ్చిబాబు సన సుకుమార్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

 Uppena Director Buchibabu Sana Comments About Director Sukumar-TeluguStop.com

1998 సంవత్సరంలో కాకినాడలోని ఒక కాలేజ్ లో సుకుమార్ మ్యాథ్స్ టీచర్ గా పని చేసేవారని.నెలకు సుకుమార్ 75 వేల రూపాయల వరకు సంపాదించేవారని బుచ్చిబాబు తెలిపారు.అయితే సినిమా రంగంపై ఉన్న ఆసక్తి వల్ల సుకుమార్ 75 వేల సంపాదన ఇచ్చే ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారని.

ఇండస్ట్రీలోకి సుకుమార్ వచ్చిన సమయంలో 500 రూపాయలు మాత్రమే వేతనంగా తీసుకుని సినిమాలకు పని చేశారని చెప్పారు.

 Uppena Director Buchibabu Sana Comments About Director Sukumar-వేల సంపాదన వదిలి రూ.500 కోసం ఆ పని చేసిన సుకుమార్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Buchibabu Sana, Director Sukumar, Kruti Shetty, Uppena Director, Vaishnav Tej, Vijay Setupati-Movie

కొన్ని సినిమాలకు రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సుకుమార్ ఆర్య సినిమాతో దర్శకునిగా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారని అన్నారు.ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు సన మాట్లాడుతూ సుకుమార్ కు సంబంధించి ఈ విషయాలను వెల్లడించారు.ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఉప్పెన సినిమా విడుదల కానుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా ఉప్పెన సినిమా తెరకెక్కింది.ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా విడుదలవుతుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

#Buchibabu Sana #Vijay Setupati #Uppena #Sukumar #Kruti Shetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు