'ఉప్పెన' ఆల్‌ టైమ్‌ రికార్డ్‌.. ప్రభాస్ ను కూడా వెనక్కు నెట్టిన మెగా హీరో

సాదారణంగా టాలీవుడ్ కు ఫిబ్రవరి మరియు మార్చి నెలలు డ్రై మంథ్స్‌ గా చెబుతూ ఉంటారు.ఎందుకంటే ఆ రెండు నెలలు కూడా పరీక్షల సీజన్ కనుక థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్‌ స్టూడెంట్స్ వచ్చే అవకాశం లేదు.

 Uppena Breaks Prabhas Mirchi Movie Record-TeluguStop.com

కనుక ఎన్నో ఏళ్లుగా ఫిబ్రవరి నెలల్లో సినిమా లు విడుదల చేయడమే చాలా అంటే చాలా చాలా తక్కువ.ప్రతి ఏడాది రెండు మూడు చిన్న సినిమా లు వస్తాయి.చాలా అరుదుగా కాస్త మీడియం రేంజ్‌ సినిమా లు విడుదల అయ్యాయి.2013 సంవత్సరం లో ప్రభాస్ నటించిన మిర్చి సినిమా వచ్చింది.అప్పట్లో ప్రభాస్‌ ఒక మోస్తరు హీరో.ఆయన మిర్చి సినిమా తో భారీ వసూళ్లను నమోదు చేశాడు.ఫిబ్రవరి నుండి మొదలుకుని సమ్మర్‌ వరకు మిర్చి కలెక్షన్స్ వేట కొనసాగింది.48.5 కోట్ల రూపాయలను మిర్చి సినిమా రాబట్టింది.అంతకు ముందు కాని ఆ తర్వాత కాని ఫిబ్రవరి నెలలో విడుదల అయిన ఏ సినిమా కు ఆ రేంజ్‌ వసూళ్లు వచ్చింది లేదు.

ఇన్నాళ్లు ‘మిర్చి’ ఆల్‌ టైమ్ ఫిబ్రవరి రికార్డును సొంతం చేసుకుని ఉంది.కాని ఇప్పుడు ఆ రికార్డును ఉప్పెన చెడిపి వేసింది.ఫిబ్రవరి లో విడుదల అయిన సినిమా కూడా ఉప్పెనకు ఉప్పెన మాదిరిగా కలెక్షన్స్‌ వచ్చాయి.49 కోట్ల రూపాయలను ఈ ఈసినిమా క్రాస్‌ చేసింది.ఈసారి కరోనా కారణంగా విద్యా సంవత్సరం సక్రమంగా లేదు.కనుక ఫిబ్రవరి నెలలో పెద్ద ఎత్తున సినిమా లు వచ్చాయి.పరీక్ష లు లేవు కనుక ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయని కొందరు అనుకోవచ్చు.కాని పరీక్ష ల కంటే కఠిన పరిస్థితులు బయట ఉన్నాయి.

 Uppena Breaks Prabhas Mirchi Movie Record-ఉప్పెన’ ఆల్‌ టైమ్‌ రికార్డ్‌.. ప్రభాస్ ను కూడా వెనక్కు నెట్టిన మెగా హీరో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా ఇంకా భారీగా కేసులు నమోదు అవుతూ భయపెడుతూనే ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో 50 కోట్ల షేర్‌ అంటే మామూలు విషయం కాదు.

కనుక ఇది ఆల్ టైమ్‌ రికార్డు మాత్రమే కాదు ఇలాంటి రికార్డులు మళ్లీ ఎప్పుడు నమోదు అవ్వవు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్‌ చేస్తున్నారు.

.

#Record Break #PrabhasMirchi #Krithy Shetty #Viashnav Tej #50 Crore Shares

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు