స్టార్ హీరోల గురించి బేబమ్మ అలా అనేసిందేంటి.. చరణ్, మహేష్ పై కామెంట్స్?

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఉప్పెన సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ప్రస్తుతం టాప్ మోస్ట్ హీరోయిన్ లలో చేరుతోంది.

 Uppena Beauty Krithi Shetty Comments On Mahesh Babu Ram Charan Details, Uppena, Mahesh Babu, Ram Charan, Tollywood, Krithi Shetty, Heroine Krithi Shetty, The Warrior Movie, Director Linguswamy, Ram Pothineni-TeluguStop.com

ఉప్పెన సినిమా విడుదల కాకముందే ఒకసారి నాలుగు ఆఫర్లను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది.మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు బాగా చేరువైన కృతి శెట్టి, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో ఈమెకు అవకాశాలు కూడా భారీగానే వచ్చాయి.

ఇక డిమాండును బట్టి రెమ్యూనరేషన్ ను కూడా పనిచేసింది ఈ ముద్దుగుమ్మ.

 Uppena Beauty Krithi Shetty Comments On Mahesh Babu Ram Charan Details, Uppena, Mahesh Babu, Ram Charan, Tollywood, Krithi Shetty, Heroine Krithi Shetty, The Warrior Movie, Director Linguswamy, Ram Pothineni-స్టార్ హీరోల గురించి బేబమ్మ అలా అనేసిందేంటి.. చరణ్, మహేష్ పై కామెంట్స్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటి సినిమాకి తక్కువ పారితోషికం అందుకున్నప్పటికీ రెండవ సినిమాతోనే ఆమెకు కోటికి పైగా రెమ్యూనరేషన్ ను అనుకుంటోంది.

ప్రస్తుతం కూడా అదే తరహాలో కొనసాగుతోంది.కాగా కృతి శెట్టి ఇక పోను పోను అగ్ర హీరోలతో కూడా సినిమాలు చేయాలని గట్టిగానే ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం కృతి శెట్టి ది వారియర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది.రామ్ పోతినేని హీరోగా నటించిన ది వారియర్ సినిమా తెలుగు,తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.

తమిళ దర్శకుడు లింగస్వామి తెరకెక్కించిన ఈ యాక్షన్ కాప్ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది అని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉన్నారు.

హీరోయిన్ కృతి శెట్టి ఒక వైపు తమిళంలో మరొకవైపు తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది.ఇంకా దర్శకుడు అలాగే హీరో ప్రమోషన్స్ లోకి రాకముందే ఈ ముద్దుగుమ్మ హడావిడిని మొదలు పెట్టేసింది.ఇకపోతే ఇటీవలే ఆమె మహేష్ బాబు రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఆ ఇద్దరి హీరోలు తనకు చాలా ఇష్టమైన హీరోలు అని, అందులో రామ్ చరణ్ సూపర్ క్యూట్ గా ఉంటాడని మహేష్ బాబు అయితే చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు అని తెలిపింది కృతి శెట్టి.

భవిష్యత్తులో ఆ ఇద్దరు హీరోలతో తప్పకుండా సినిమాలు చేయాలి అనుకున్నట్లు తన మనసులోని కోరికను బయటపెట్టేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube