పడవపై పరామర్శకు వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. తిట్టి పోసిన స్థానికులు!  

MLA Subhash Reddy,Went on a boat to consult people,The MLA had a serious bitter incident,People counter-attacked - Telugu Mla Subhash Reddy, People Counter-attacked, The Mla Had A Serious Bitter Incident, Went On A Boat To Consult People

గత మూడు రోజుల నుంచి హైదరాబాద్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం మొత్తం అతలాకుతలమైంది.ఏ కాలనీ చూసిన చెరువులను తలపిస్తున్నాయి.

TeluguStop.com - Uppal People Serious On Trs Mla Subhash Reddy

అయితే ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గానికి వెళ్లి ప్రజలను పరామర్శించి వారికి సహాయం చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ నేపథ్యంలో భాగంగా తెరాస ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఉప్పల్ ప్రాంతంలోని వరద నీటి ప్రాంతాలలోనీ ప్రజలను పరామర్శించడానికి బోటులో వెళ్లారు.

అయితే అక్కడ ఎమ్మెల్యేకు తీవ్రమైన చేదు సంఘటన ఎదురైంది.ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ పేరు రాసి చచ్చిపోతాము.

TeluguStop.com - పడవపై పరామర్శకు వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. తిట్టి పోసిన స్థానికులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్కడి ప్రజలను పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యేపై ప్రజలు ఎదురు దాడిచేశారు.

కొంతమంది మహిళలు ఎమ్మెల్యేను చూడగానే “మేమిక్కడ ఉండాలా చావాలా… గత మూడు రోజులుగా కట్టుకోడానికి బట్టలు లేవు… తినడానికి తిండి లేదు.మేం బ్రతకాలా, చావాలా చెప్పండి.

మీ పేరు రాసి చచ్చిపోతామంటూ” ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే చెప్పే మాటలను వారు వినిపించుకోకుండా ఒక్కసారిగా అందరూ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు.

మరికొంతమంది పెట్రోల్ పోసుకుని ఇక్కడే చచ్చిపోతా మంటూ బెదిరించారు

ఇక చేసేదేమి లేక ఎమ్మెల్యే కలుగజేసుకుని మిమ్మల్ని ఇక్కడ ఎవరు ఇల్లు కట్టుకోమన్నారు? అని ఎమ్మెల్యే అడగగా దీంతో మరింత కోపోద్రిక్తులైన కాలనీవాసులు మేము ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరని ఎదురు ప్రశ్నలు వేశారు.గత కొద్ది రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంటే ఇప్పుడు పరామర్శించడానికి వచ్చారా ?ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేపట్టిందని నిలదీశారు.ప్రభుత్వం చర్యలు చేపట్టింది గనుకే రెండు గజాల ఎత్తులో ఉన్న నీటిని పంపు చేశామని ఎమ్మెల్యే చెప్పగా అతని మాటలు వినకుండా అతని తిడుతూనే ఉన్నారు.అయితే ఎమ్మెల్యే బోటును కారు వద్దకు వెళ్ళమని చెప్పి కారులో ఎక్కుతుండగా అక్కడి ప్రజలు చెప్పులతో దాడి చేశారు.

ఎమ్మెల్యే పై దాడి జరిగిన ఈ ఘటన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

#WentOn #TheMLA

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uppal People Serious On Trs Mla Subhash Reddy Related Telugu News,Photos/Pics,Images..