కపుల్ ఛాలెంజ్‌ అంటూ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారా...? జాగ్రత్త అంటున్న పోలీసులు...!

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక అవసరం లేని ఛాలెంజ్ లు పుట్టుకొస్తుంటాయి.ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల యొక్క పర్సనల్ ఫోటోలను లేకపోతే వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే విధంగా ఉంటాయి.

 Social Media, Police, Warning, Software, Challenge, Police Warning, Photos,-TeluguStop.com

వేరే వారు ఎవరో చాలెంజ్ విసిరారంటే చాలు, ముందు వెనకా ఆలోచించకుండా వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ అప్లోడ్ చేసి మరొకరికి ఛాలెంజ్ వాడుతుంటారు.ఇప్పటివరకు సోషల్ మీడియాలో అనేక ఛాలెంజ్ లు నడిచాయి.

ఇది వరకు టెన్ ఇయర్స్ ఛాలెంజ్ అనే ఒక ఛాలెంజ్ నడిచిన, తాజాగా మరోసారి కపుల్ ఛాలెంజ్ అనే ఛాలెంజ్ తో దెబ్బకి సోషల్ మీడియాలో ఫోటోలు తెగ అప్లోడ్ చేస్తున్నారు.

ఎవరో ఒకరు ఛాలెంజ్ చేశారని, లేకపోతే వారు ఫోటోలు అప్లోడ్ చేశారని మనం ఎందుకు చేయకూడదని ఉద్దేశంతో చాలామంది వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వస్తున్నారు.

అయితే ఇందుకు సంబంధించి పూణే నగరం సంబంధించిన పోలీస్ శాఖ స్పందించింది. ఇలా ఛాలెంజ్ ల పేర్లతో సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేయడం ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీస్ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

ఇలా సోషల్ మీడియాలో ఎవరు అంతకు వారు ఫోటోలు అప్లోడ్ చేయడం ద్వారా ఆ ఫోటోలను సులభంగా డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్ఫింగ్ చేసి బెదిరించే ఆస్కారం ఉందని పోలీసులు తెలియజేస్తున్నారు.దీంతో చాలా మంది మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని… కాబట్టి, ఇటువంటి ఛాలెంజ్ లో పాల్గొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రస్తుతం అంతర్జాలంలో ఇలా ఫోటోలను నగ్నంగా చేసి రూపొందించే సాఫ్ట్వేర్లు ఎన్నో పుట్టుకొస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube