కేజిఎఫ్ రేంజ్ లో సిద్దమవుతున్న ఉపేంద్ర.. మరి హిట్ కొడతాడా..?

తెలుగులో ఇటీవలే ప్రముఖ దర్శకుడు చంద్రు “కబ్జ” అనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఎప్పుడూ విభిన్న తరహా కథలతో కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో ముందుండేటువంటి కన్నడ హీరో ఉపేంద్ర హీరోగా నటిస్తున్నాడు.

 Upendra Try To Beat Kgf Movie Records With His Kabja Movie In South, Upendra Rao-TeluguStop.com

కాగా ఇటీవలే ఉపేంద్ర పుట్టిన రోజు కావడంతో టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన  థీమ్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి.

అయితే ఈ చిత్రం స్వాతంత్రం వచ్చిన తరువాత 1947 సంవత్సరం నుంచి 1980వ సంవత్సరం మధ్య కాలంలో  జరిగినటువంటి భూ తగాదాల విషయాలను దర్శకుడు చందు తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

దీనికితోడు ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను పరిశీలించినట్లయితే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్  కర్ణాటకలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో పెద్దపెద్ద సెట్లను నిర్మించి చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే గతంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, తదితర భాషలలో కేజిఎఫ్ చాప్టర్ – వన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.దీంతో ఉపేంద్ర కూడా తన చిత్రాన్ని దాదాపుగా నాలుగు భాషలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

అయితే హీరో ఉపేంద్ర హీరోగానే కాకుండా గతంలో దర్శకుడిగా, నిర్మాతగా కూడా ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు.కానీ గత కొద్ది కాలంగా తన స్టార్ హీరో ఇమేజ్ కి తగ్గ హిట్ లేకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు అంతేకాక ఈ చిత్రం కోసం 1970 కాలంలో కనిపించే బాడీ లాంగ్వేజ్ మరియు హెయిర్ స్టైల్ తదితర వాటి కోసం బాగానే కసరత్తులు చేస్తున్నాడు.

మరి కేజిఎఫ్ రికార్డులని ఉపేంద్ర తన చిత్రం తో  కబ్జ చేస్తాడో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube