దిశను రేప్ చేసింది అసలు ఆ నలుగురేనా..? : హీరో ఉపేంద్ర  

Upendra Latest Tweet-upendra,upendra Support Tp Tweet In Disha Accussed

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కన్నడ హీరో ఉపేంద్ర చేసిన ట్వీట్ దుమారాన్ని రేపుతుంది.కొందరు నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు.దిశను అత్యాచారం చేసి.చంపింది అసలు ఆ నలుగురేనా.? అని ఉపేంద్ర తన ట్వీట్‌లో ప్రశ్నించారు.పెద్దవాళ్లు విషయంలోనూ ఈ విధమైన ఎన్‌కౌంటర్‌లు ఎందుకు జరగడం లేదని అడిగారు.అసలు కోర్టు విచారణ పూర్తికాకముందే నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం సరికాదన్నారు.

Upendra Latest Tweet-upendra,upendra Support Tp Tweet In Disha Accussed Telugu Viral News Upendra Latest Tweet-upendra Upendra Support Tp Tweet In Disha Accussed-Upendra Latest Tweet-Upendra Support Tp Tweet In Disha Accussed

నిజాయితీ కలిగిన అధికారులు దృష్టిపెడితే ఎన్‌కౌంటర్‌ల ద్వారా మహిళలపై రేప్‌లు నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.కానీ ధనవంతులు, ప్రముఖులు దీనిని దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన అవసరం ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే ఉపేంద్ర ట్వీట్‌కు కొందరు మద్దతు తెలుపుతుండగా, చాలా మంది ఆయన మాటలను ఖండిస్తూ కామెంట్లు పెడుతున్నారు.ఓ రాజకీయ నాయకుడుగా, స్టార్‌ హీరోగా ఉపేంద్ర ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు అంటున్నారు.

తాజా వార్తలు