కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సౌత్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.విలక్షణ నటుడుగా పేరున్న ఉపేంద్ర చేసే సినిమాలు సోషల్ ఎలిమెంట్స్ మీద సెటైరికల్ గా సనిమాలు చేస్తూ ఉంటాడు.
ఓ వైపు హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇతర భాషలలో చేయడానికి ఉపేంద్ర రెడీ అవుతున్నాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం సౌత్ లో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది.
స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలు అంటూ అన్ని భాషలలో తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు.మార్కెట్ ని విస్తరించుకోవడానికి హీరోలకి ఈ పాన్ ఇండియా అనేది మంచి అవకాశంగా దొరికింది.
ఇప్పుడు ఇదే దారిలో ఉపేంద్ర కూడా పాన్ ఇండియా లెవల్ లో తన కొత్త సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.కన్నడ దర్శకుడు చంద్రు దర్శకత్వంలో కబ్జా అనే టైటిల్ తో ఒక గ్యాంగ్ స్టార్ కథతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.
కేజీఎఫ్ స్ఫూర్తితో చంద్రు ఈ సినిమా కాన్సెప్ట్ ని పీరియాడికల్ గా ఆవిష్కరిస్తున్నాడు.మొత్తం ఏడూ భాషలలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. 1970ల కాలంలో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది.తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.
ఈ ఫస్ట్ లుక్ లో ఉపేంద్ర పాత్ర చాలా పవర్ ఫుల్ గా బ్లడ్ అండ్ యాక్షన్ తరహాలో ఉంది.మరి ఈ సినిమా కూడా కేజీఎఫ్ తరహాలో పాన్ ఇండియా లెవల్లో సత్తా చూపిస్తుందేమో చూడాలి.
.