ఉపేంద్ర ఖాకీ చొక్కా రాజకీయం! కర్ణాటకలో సంచలనం

ఇప్పటి వరకు సినిమాలో సంచలనాలకి కేంద్ర బిందువుగా ఉంటూ.అందరూ వెళ్ళే దారిలో కాకుండా తనదైన స్టైల్లో డిఫరెంట్ సినిమాలని ప్రేక్షకులకి అందిస్తూ సత్తా చాటిన హీరో ఉపేంద్ర.

 Upendra Annouce Lok Sabha Candidates First List-TeluguStop.com

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన ఉపేంద్ర తెలుగు ప్రజలకి కూడా భాగా పరిచయం.వెరైటీ కంటెంట్ తో వచ్చే ఉపేంద్ర సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకి కూడా విపరీతమైన ఆసక్తి ఉంటుంది.

ఇదిలా ఉంటే సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా ఉపేంద్ర తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.

గతంలో రాజకీయ పార్టీ పెట్టి దెబ్బ తిన్న ఉపేంద్ర ఆ పార్టీ నుంచి బయటకి వచ్చి మళ్ళీ కొత్త పార్టీ ఏర్పాటు చేసాడు.

ఇక రాజకీయాలలో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్న ఉపేంద్ర తాజాగా లోక్ సభకి పోటీ చేసే తన పార్టీ అభ్యర్ధుల మొదటి జాబితాని ప్రకటించాడు.కర్ణాటకలో 28 లోక్ సభ స్థానాలకి 18 అభ్యర్ధుల మొదటి జాబితాని ఉపేంద్ర ప్రకటించి సంచలనం సృష్టించాడు.

ఇదిలా ఉంటే ఇపుడు అన్ని పార్టీలకి భిన్నంగా తన పార్టీ అభ్యర్ధులకి ఉపేంద్ర డ్రెస్ కోడ్ ఇచ్చాడు.ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులు కచ్చితంగా ఖాకీ చొక్కా ధరించి ప్రచారం చేసుకోవాలని చెప్పాడు.అలాగే ఎలక్షన్స్ కి అవసరమైన డబ్బుని అభ్యర్ధులే సమకూర్చుకోవాలని చెప్పుకొచ్చాడు.అదే టైంలో ఎలక్షన్స్ లో ఓట్లు కోసం డబ్బులు ఖర్చు పెట్టకూడదు అంటూ కండిషన్స్ కూడా పెట్టాడు.

ఇలా తన సినిమాల లాగే, రాజకీయాలలో కూడా ఉపేంద్ర తనదైన యునిక్ స్టైల్ లో ఫాలో అవుతూ అందరికి ఆకర్షిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube