భారత మార్కెట్లో ప్రముఖ కంపెనీల నుండి ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతూనే ఉన్నాయి.అక్టోబర్ లో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్లు ఏవో చూద్దాం.
శాంసంగ్ గెలాక్సీ S23 FE:
అక్టోబర్ మొదటి వారంలో ఈ స్మార్ట్ ఫోన్( Samsung Galaxy S23 FE ) భారత మార్కెట్లో విడుదల అవ్వనుంది.ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.4 అంగుళాల FHD+AMOLED డిస్ ప్లే తో ఉంటుంది.25W ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేసే 4500mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ లెన్స్, 10MP సెల్పీ కెమెరా, 8MP అల్ట్రా వైట్ లెన్స్, 12MP టెలిఫోటో లెన్స్ ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి.మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
వన్ ప్లస్ ఓపెన్:
ఈ స్మార్ట్ ఫోన్( One Plus Open ) అక్టోబర్ రెండో వారంలో భారత మార్కెట్లో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.ఈ ఫోన్ 7.8 అంగుళాల 2K AMOLED స్క్రీన్, 6.3 అంగుళాల AMOLED కవర్ డిస్ప్లే ఉంటుంది.ఇది ఫోన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్.
ఈ స్మార్ట్ ఫోన్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వివో V29 సిరీస్:
ఈ ఫోన్ అక్టోబర్ మొదటి వారంలో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.ఈ సిరీస్ లో రెండు వేరియెంట్లు అందుబాటులో ఉన్నాయి.వివో V29 మోడల్( Vivo V29 ) విషయానికి వస్తే.6.78 అంగుళాల ఫుల్ హెచ్డి+ AMOLED డిస్ ప్లే తో ఉంటుంది.50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ కెమెరాతో కూడిన రియల్ ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంటుంది.

రెడ్ మీ నోట్ 13 5G:
ఈ స్మార్ట్ ఫోన్ అక్టోబర్ చివరి వారంలో భారత మార్కెట్లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.6.6 అంగుళాల FHD+ OLED డిస్ప్లే తో ఉంటుంది.మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్ సెట్, 108ఎంపీ ప్రైమరీ లెన్స్, 2ఎంపీ డెత్ సెన్సార్ తో కూడిన డ్యూయల్ రియల్ కెమెరా సెట్ అప్, 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఫీచర్ లతో ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన ధర వివరాలు, మిగతా వివరాలు లాంచ్ అప్పుడు వెలువడే అవకాశం ఉంది.