ఆగష్టు చివరి వారంలో ప్రేక్షకులను అలరించే చిత్రాలివే.. సరికొత్త రికార్డ్స్ ఖాయమా?

ప్రతివారం లాగే ఈ వారం కూడా థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సినిమాలు రెడీ అయ్యాయి.

మరి ఆగస్టు చివరి వారంలో విడుదల కాబోతున్న ఆ సినిమాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టాలీవుడ్ హీరో నాని హీరోగా నటించిన చిత్రం సరిపోదా శనివారం.( Saripodhaa Sanivaaram ) వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ గా నటించిన విషయం తెలిసిందే.

ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే నటుడు దేవ్ గిల్ హీరోగా మారి నటించిన సినిమా అహో విక్రమార్క.( Aho Vikramaarka ) త్రికోటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 30న విడుదల కానుంది.

Advertisement

నాగార్జున నటించిన మాస్ ఎంటర్టైనర్ సినిమా మాస్ దమ్ముంటే కాస్కో. 2004లో విడుదలైన ఈ సినిమా ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో మళ్ళీ రి రిలీజ్ కానుంది.అయితే కొత్త సినిమాలతో పోటీపడి మరీ ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.ఇకపోతే ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్‌ల విషయానికి వస్తే.1999లో సుమారు 188మంది ప్రయాణిస్తున్న ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ ఫ్లైట్‌ 814ను హైజాక్‌ చేశారు ఉగ్రవాదులు.ప్రయాణికులను దాదాపు 7రోజుల పాటు బందీలుగా ఉంచారు.

ప్రపంచ ఏవియేషన్‌ చరిత్రలోనే అతి పెద్ద హైజాక్ ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయిన ఈ సంఘటన ఆధారంగా రూపొందుతున్న సిరీస్‌ ఐసీ814:ది కాంధార్‌ హైజాక్‌.( IC 814 The Kandahar Hijack )

అనుభవ్‌ సిన్హా దీన్ని రూపొందించిన ఈ సిరీస్ లో విజయ్‌ వర్మ, అరవింద్‌ స్వామి, దియా మీర్జా, నసీరుద్దీన్‌ షా తదితరులు కీలక పాత్రలో నటించారు.ఆగస్టు 29వ తేదీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.ఇకపోతే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యే సిరీస్ ల విషయానికి వస్తే.

నో గైన్‌ నో లవ్‌( No Gain No Love ) అనే కొరియన్‌ సిరీస్‌ ఆగస్టు 26 స్ట్రీమింగ్‌ కానుంది.లార్డ్‌ ఆఫ్ ది రింగ్స్‌ 2 అనే వెబ్‌సిరీస్‌ ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

ఇక నెట్‌ఫ్లిక్స్‌ విషయానికి వస్తే.ది డెలివరెన్స్‌ అనే వెబ్‌సిరీస్‌ ఆగస్టు 30 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Advertisement

అలాగే బ్రీత్‌లెస్‌ అనే వెబ్‌సిరీస్‌ కూడా ఆగస్టు 30 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.జియో సినిమాలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల విషయానికొస్తే.

ఎబిగైల్‌ హాలీవుడ్‌ ఆగస్టు 26 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.అలాగే గాడ్డిల్లా వర్సెస్‌ కాంగ్‌ అనే హాలీవుడ్‌ మూవీ ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

తాజా వార్తలు