రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు.... వైరల్ అవుతున్న ఉపాసన బేబీ బంప్ ఫోటోస్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) మార్చి 27 న పుట్టిన రోజు(Birthday)ను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) టాలీవుడ్ సెలబ్రిటీ లందరికీ పెద్ద ఎత్తున ఆహ్వానం పంపి పార్టీ ఇచ్చారు.

 Upasana With Baby Bump At Ram Charan Birthday Celebrations Pics Viral Details, B-TeluguStop.com

ఈ క్రమంలోనే నిన్న రాత్రి టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం మెగా కాంపౌండ్ లో వాలిపోయారు.ఇలా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఎంతో ఘనంగా పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ పుట్టిన రోజు వేడుకలలో భాగంగా రామ్ చరణ్ ఉపాసన జంటగా కనిపించారు.

ఈ క్రమంలోనే ఉపాసన(Upasana) ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఇందులో ఉపాసన బేబీ బంప్(Baby Bump) చాలా క్లియర్ గా కనిపించడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇన్ని రోజులు ఉపాసన తల్లి కాబోతుంది అంటే ఆమె ఆరు నెలల గర్భవతి అయిన ఇప్పటికీ బేబీ బంప్ కనిపించకపోవడంతో ఆమె సరోగసి ద్వారా పిల్లల్ని కంటుంది అంటూ ఎన్నో రకాల రూమర్లు వచ్చాయి.అయితే తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా బ్లూ కలర్ డ్రెస్ ధరించినటువంటి ఉపాసన ఈ డ్రెస్సులో బేబీ బంప్ క్లియర్ గా కనిపించడంతో ఈమె గురించి వస్తున్న వార్తలకు పూర్తిగా చెక్ పడినట్లు అయింది.

ఇలా ఉపాసన రాంచరణ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఉపాసన ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి మరికొద్ది నెలలలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.ఈ క్రమంలోనే మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా బుల్లి వారసుడి కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ఈయనకు ఈ ఏడాది బాగా కలిసి వచ్చినట్టుంది లోకల్ టు గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకోవడమే కాకుండా తండ్రిగా కూడా ప్రమోట్ కాబోతున్నారు.

ఏది ఏమైనా రాంచరణ్ అందుకున్నటువంటి ఈ సక్సెస్ మెగా అభిమానులను ఎంతో ఆనందానికి గురి చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube